Share News

BRS: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి నేతల రాజీనామా

ABN , First Publish Date - 2023-10-27T20:44:36+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లోని పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు కీలక నేతలు పార్టీకి బిగ్ ఝలక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరారు

BRS: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి నేతల రాజీనామా

నిజామాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లోని పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు కీలక నేతలు పార్టీకి బిగ్ ఝలక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరారు. రాజీనామాను బీఆర్ఎస్ అధిష్ఠానానికి పంపించారు. అయితే కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటు వస్తున్నారు. కొద్దిరోజులు క్రితం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్‌రెడ్డిని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తమకు కాంగ్రెస్ పార్టీ అయితేనే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని భావించినా నేతలు హస్తం పార్టీలో చేరేందుకు మొగ్గుచూపారు. ఢిల్లీలో ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లలిత, రవీందర్ రెడ్డిని ఖర్గే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన లలితను కాంగ్రెస్‌లో చేరకుండా నిజామాబాద్ జిల్లా నేతలు అడ్డుపడ్డారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున లలిత ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. తిరిగి ఈ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్‌లోకి ఆకుల లలిత రీ ఎంట్రీ ఇచ్చారు. ఎల్లారెడ్డి టికెట్ ఆశిస్తూ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏనుగు రవీందర్ రెడ్డి చేరారు. కాగా ఈ ఇద్దరి నేతలపై స్థానిక నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలు తిరిగి పార్టీలో చేరడంతో కొంత ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి క్యాడర్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అగ్ర నాయకులు రంగంలోకి దిగినట్లు విశ్వాసనీయ సమాచారం.

Updated Date - 2023-10-27T23:07:36+05:30 IST