Share News

Pocharam Srinivasa Reddy : రైతుబంధు ఆపాలన్న కాంగ్రెస్‌కి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి

ABN , First Publish Date - 2023-10-26T19:04:09+05:30 IST

రైతుబంధు పథకాన్ని అపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇవ్వడం సరైంది కాదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Speaker Pocharam Srinivasa Reddy ) అన్నారు.

 Pocharam Srinivasa Reddy : రైతుబంధు ఆపాలన్న కాంగ్రెస్‌కి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి

కామారెడ్డి: రైతుబంధు పథకాన్ని అపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇవ్వడం సరైంది కాదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Speaker Pocharam Srinivasa Reddy ) అన్నారు. గురువారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలని అపివేయాలనడం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఐదు వేల మంది రైతుల కుటుంబాలని రైతు బీమా పథకాన్ని ఇచ్చాం. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కి ఓటు వేయవద్దని తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. చెప్పింది మాత్రమే చేయడమే కేసీఆర్ లక్ష్యం. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతు వ్యతిరేకిగా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వినతిపత్రం దుర్మర్గమైన చర్య. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు, రైతులు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. కర్ణాటకలో ప్రజలని మోసం చేసినట్లు తెలంగాణ ప్రజలని మోసం చేయవద్దు. కామారెడ్డిలో వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరాడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులకి కామారెడ్డిలో డిపాజిట్ కూడా రాదు. కామారెడ్డి నియోజకవర్గం ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు.’’ అని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

Updated Date - 2023-10-26T19:07:09+05:30 IST