Share News

Kanipakam: రసాభాసగా కాణిపాకం ఆలయ సమావేశం.. ఈవోపై గుడి కమిటీ ఫైర్

ABN , Publish Date - Aug 11 , 2024 | 08:31 PM

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఉభయ దారుల సమావేశం ఆదివారం నాడు జరిగింది. అయితే ఈ సమావేశం రసాభాసగా మారింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 21 రోజుల పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

Kanipakam: రసాభాసగా కాణిపాకం ఆలయ  సమావేశం.. ఈవోపై గుడి కమిటీ ఫైర్
Kanipakam Varasiddhi Vinayaka Swamy Temple

చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఉభయ దారుల సమావేశం ఆదివారం నాడు జరిగింది. అయితే ఈ సమావేశం రసాభాసగా మారింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 21 రోజుల పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ ఏర్పాట్లపై ఆలయ ఉభయదారులతో దేవస్థానం ఈవో వెంకటేష్ , అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.


కాగా, ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఆహ్వాన పత్రికలు ఉండాలి కానీ... ఇందుకు వ్యతిరేకంగా చిత్తు పేపర్లలో ఆహ్వాన పత్రికలు ముద్రించడం ఏంటని ఈవోను ఉభయదారులు ప్రశ్నించారు. వాహనసేవ నిర్వహించే వారి పేర్లు, తదితర విషయాలు ముద్రించకపోవడం బాధాకరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆహ్వాన పత్రికలను ముద్రించడానికి ఈవో దగ్గర డబ్బులు లేకపోతే ఉభయదారులు కలిసి ముద్రించడానికి అవసరమైన నగదు తాము ఇస్తామంటూ అధికారులను నిలదీశారు. కాణిపాకం తమ ఆలయమని.. అధికారుల పెత్తనం చేస్తున్నారని.. ఇది సహించమని ఉభయ దారులు స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవంలో వాహనసేవ నిర్వహణపై ఉబయదారుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తోపులాటలు జరగడంతో దాడి చేసుకునే పరిస్థితి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి వచ్చింది.

Updated Date - Aug 11 , 2024 | 08:33 PM