Share News

Pawankalyan: మేము అద్భుతాలు చేస్తామని చెప్పాం.. కానీ

ABN , Publish Date - Jul 01 , 2024 | 01:07 PM

Andhrapradesh: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గెలిచాక పెన్షన్లు రద్దు చేస్తామని వైసీపీ ప్రచారం చేసిందని.. కానీ తాము గెలిచాక పెంచి ఇచ్చామని చెప్పుకొచ్చారు.

Pawankalyan: మేము అద్భుతాలు చేస్తామని చెప్పాం.. కానీ
Deputy CM Pawan Kalyan

కాకినాడ, జూలై 1: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల (AP Pension) పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గెలిచాక పెన్షన్లు రద్దు చేస్తామని వైసీపీ ప్రచారం చేసిందని.. కానీ తాము గెలిచాక పెంచి ఇచ్చామని చెప్పుకొచ్చారు.

AP Pensions: పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లారట.. ఎక్కడంటే?


‘‘నావి కీలక శాఖలు. గెలిచాక ఎందుకు రాలేదంటే నాకు ఊరేగింపులు ఇష్టం లేదు. నేరుగా పనిలోకి వెళ్ళలనుకున్నా. కృతజ్ఞత పెన్షన్లు ఇవ్వడం ద్వారా చాటాలనుకున్నా. నా శాఖలపై అధ్యయనం మొదలుపెట్టాను. దివ్యాంగులు గతంలో చాలా నష్టపోయారు. పీఆర్ శాఖలో అడ్డగోలుగా వైసిపి నిధులు మల్లించింది. నా శాఖలో నా వైపు అవినీతి ఉండదు. గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల 80 శాతం చేపల చెరువులు.. కానీ తాగడానికి నీళ్లు లేవు. జల్ జీవన్ మిషన్‌కు కేంద్రం నిధులు ఇస్తుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. రుషికొండలో విలాస భవనం అవసరమా? నా కొత్త క్యాంప్ ఆఫీస్‌కు నా ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటా అని చెప్పా. నా శాఖలో ఆర్థిక అక్రమాలు చాలా చేశారు. మేము అద్భుతాలు చేస్తాం అని చెప్పము. కానీ జవాబుదారీతనం గా ఉంటాం’’ అని పవన్ స్పష్టం చేశారు.

KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ


అప్పుడే ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటా...

పిఠాపురంలో తాగునీటి సమస్య తీర్చాలన్నారు. పెన్షన్లు ఇంకా అందని వారికి అందేలా చూస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో పంచాయతీలను ఎంచుకుని పారిశుధ్యం, తాగునీటి సమస్య తీర్చుతామన్నారు. పనిచేసి నియోజకవర్గంలో విజయయాత్ర చేస్తానన్నారు. ప్రజల మన్ననలు పొందాక తనకు తాను ఎమ్మెల్యే గా ప్రకటించుకుంటానని వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. చంద్రబాబు (CM Chandrababu Naidu) అపార అనుభవం వలనే ఈరోజు పెన్షన్లు ఇవ్వగలిగామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ అరాచకాలు సరిదిద్ది రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగేది చంద్రబాబే అని అన్నారు.

AP News: పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం..


ప్రజలు తనకు సుస్థిర స్థానం ఇచ్చారన్నారు. ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికెలో పరిష్కారం కావని వెల్లడించారు. కూటమికి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పెన్షన్ వస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు పెన్షన్ల కోసం ఒక్కొక్కరి వద్ద రూ.300 వరకు లంచం తీసుకున్నారని ఆరోపించారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వంలో సచివాలయాల ద్వారా చాలా వేగంగా పంచామన్నారు. కానీ ఎక్కడైనా పెన్షన్లు ఆగాయా అని ప్రశ్నించారు. అధికార వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మళ్ళీ తాము వ్యవస్థలను బాగు చేస్తున్నామన్నారు.

Cricket: టీమిండియా కొత్త కోచ్.. కెప్టెన్‌పై జైషా సంచలన ప్రకటన..


పౌరసరఫరాల శాఖలో ఎన్ని వేల టన్నుల బియ్యం పట్టుకున్నారో తెలుసుకదా అని అన్నారు. గోడౌన్‌లో ఎంత బియ్యం పెట్టుకున్నారో తెలుసుకదా అని తెలిపారు. అది ప్రజల డబ్బన్నారు. ఇది కరక్షన్ ప్రభుత్వమన్నారు. ‘‘వైసీపీ ఇంకా మమ్మల్ని తిడుతున్నా మేము మాట్లాడడం లేదు. కానీ మీ అవినీతి బయటకు తీస్తాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇన్నో వందల కోట్లు సంపాదించాను నేను సినిమాల్లో. అలాంటి నేను పంచాయతీ శాఖలో నాలుగు గంటలు కూర్చుంటే చాలా అవినీతి కనిపించింది’’ అని తెలిపారు. అసెంబ్లీ సీట్లలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించినట్లే రాష్ట్రంలో అన్ని గ్రామాలకు రక్షిత నీరు అందిస్తామన్నారు. అరకు వెళ్లి అన్ని గ్రామాలు చూడాలని.. అక్కడ ప్రజల సమస్యలు అన్ని చూసి పరిష్కరించాలి అనుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి....

After Rohit Sharma: రోహిత్ శర్మ తర్వాత భారత టీ20కి కెప్టెన్ ఎవరు.. పోటీలో ఐదుగురు స్టార్ ప్లేయర్లు

AP News: మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ అమలు చేస్తాం: పల్లా శ్రీనివాస్

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 01 , 2024 | 01:22 PM