Share News

Srinivas Verma: వైసీపీ ప్రభుత్వం నిధులు మళ్లించింది

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:05 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Minister Bhupathiraju Srinivas Verma) తెలిపారు.

Srinivas Verma: వైసీపీ ప్రభుత్వం నిధులు మళ్లించింది
Bhupathiraju Srinivasavarma

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Minister Bhupathiraju Srinivas Verma) తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు కాకుండా, వేరే వాటికి మళ్లించారని మండిపడ్డారు. యుటిలిటీ సర్టిఫికెట్స్ ఇవ్వలేదని, తాము ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయనే క్లారిటీ లేదన్నారు.

కాబట్టి తాము నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఆయా శాఖల కార్యదర్శులు ఇటీవల సీఎం చంద్రబాబుకు చెప్పారని గుర్తుచేశారు. ఆయన 9 శాఖల అధికారులతో సమావేశం అయితే అందరూ ఇదే చెప్పారని.. దీనిని బట్టి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మళ్లించారనే విషయాన్ని గ్రహించాలని అన్నారు.


తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఇద్దరు కలిశారని విభజన చట్టంలో ఉన్న కొన్ని అంశాలు ఇప్పటికీ పూర్తి కాలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సహకారం లేకపోవడం, వైసీపీ ప్రభుత్వానికి పలు అంశాలపై ఆలోచన లేకపోవడంతో చట్టంలో ఉన్న విషయాలు అమలు కాలేదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం తనకో లేక, బీజేపీకో సంబంధించిన విషయం కాదని అన్నారు.

పెట్టుబడుల ఉప సంహరణలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని అంశం తెర మీదకు వచ్చిందని చెప్పారు. ఈ సంవత్సరం కూడా నష్టాలు వచ్చాయని ఈ విధంగా నష్టాలు పూడ్చాలంటే అంటే ఏ ప్రభుత్వానికి అయినా కష్టమని అన్నారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అత్యున్నత స్థాయి బృందమని భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొ్న్నారు.

Updated Date - Jul 07 , 2024 | 03:05 PM