Share News

AP Elections: రాక్ష పాలనకు చరమ గీతంపాడటం ఖాయం: కూటమి నేతలు

ABN , Publish Date - May 09 , 2024 | 02:21 PM

Andhrapradesh: అమరావతిపై సీఎం జగన్ రెడ్డికి సీతకన్ను అని కూటమి నేతలు మండిపడ్డారు. గురువారం కూటమి నేతలు వర్లరామయ్య, మాల్యాద్రి, లంకా దినకర్, యామిని శర్మ, శివశంకర్, అజయ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ... మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ రెడ్డి విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.

AP Elections: రాక్ష పాలనకు చరమ గీతంపాడటం ఖాయం: కూటమి నేతలు
Alliance leaders Hot Comments on CM Jagan

అమరావతి, మే 9: అమరావతిపై సీఎం జగన్ రెడ్డికి (CM Jagan Reddy) సీతకన్ను అని కూటమి నేతలు మండిపడ్డారు. గురువారం కూటమి నేతలు వర్లరామయ్య, మాల్యాద్రి, లంకా దినకర్, యామిని శర్మ, శివశంకర్, అజయ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ... మూడు ముక్కలాటతో అమరావతిని (Amaravati) జగన్ రెడ్డి విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. వికేంద్రీకరణ పేరుతో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. భూములను దోచుకునేందుకు విశాఖలో రాజధాని అంటూ ప్రకటన చేశారన్నారు. రుషికొండకు గుండు కొట్టి ప్రజల సొమ్ములతో జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు.

AP Election 2024: జిల్లాల వారీగా సర్వే వివరాలు ప్రకటించిన గోనె ప్రకాశరావు


రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాల భూములిచ్చారని.. మిగులు భూములతో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కొత్త రాజధాని నిర్మాణం చేపట్టాలంటే ప్రభుత్వమే మరో 50 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యమని.. అకాచకం, విధ్వంసం విపరీతమని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామిక వాడలను కేంద్రం అప్రూవ్ చేసినప్పటికీ జగన్ భూములు కేటాయించలేదని విమర్శించారు. జగన్ రెడ్డికి అభివృద్ధి వికేంద్రీకరణకు రాజధాని వికేంద్రీకరణకు తేడా తెలియడంలేదన్నారు. అమరావతిపై దాడి దళితులపై దాడే అని చెప్పుకొచ్చారు.

AP Election 2024: జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్


అమరావతి చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 20 ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నారు. అమరావతి చుట్టూ 9 లక్షల మంది మైనార్టీలు ఉన్నారన్నారు. అమరావతిపై దాడి చేయడమంటే కిస్ట్రియన్లు, ముస్లింలపై దాడిచేయడమే అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది అర్థం అయ్యిందని.. రాక్ష పాలనకు చరమ గీతంపాడటం ఖాయమన్నారు. జగన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడానికి సెంట్రల్ జైల్ సిద్ధంగా ఉందంటూ కూటమి నేతలు ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి...

CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్..

AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 02:22 PM