Share News

Pawan Kalyan: నేను బయటకొస్తే సహాయ చర్యలకు ఆటంకం: డిప్యూటీ సీఎం పవన్..

ABN , Publish Date - Sep 04 , 2024 | 02:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు.

Pawan Kalyan: నేను బయటకొస్తే సహాయ చర్యలకు ఆటంకం: డిప్యూటీ సీఎం పవన్..
Deputy CM Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు. ఏపీలో 3,312కి.మీ. మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు, భవనాల శాఖకు తీవ్రం నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. అలాగే 1.69లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 18,424హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన 233కి.మీ. మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు. వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు 60పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.

Updated Date - Sep 04 , 2024 | 02:48 PM