Jogi Ramesh: జోగికి మరోసారి నోటీసులు... విచారణకు గైర్హాజరు
ABN , Publish Date - Aug 20 , 2024 | 04:36 PM
Andhrapradesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఇదివరకే జోగిరమేష్ పోలీసుల విచారణను ఎదుర్కున్న విషయం తెలిసిందే.
గుంటూరు, ఆగస్టు 20: మాజీ మంత్రి జోగి రమేష్ (Former Minister Jogi Ramesh) ఈరోజు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఇదివరకే జోగిరమేష్ పోలీసుల విచారణను ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి విచారణకు రావాల్సి ఉండగా.. జోగి రమేష్ గైర్హాజరయ్యారు. మాజీమంత్రి తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. జోగి రమేష్ విచారణ రావడం లేదని లాయర్లు స్పష్టం చేశారు.
Karnataka: సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?
కాగా... చంద్రబాబుపై ఇంటిపై దాడి కేసులో జోగిరమేష్‌కు పోలీసులు ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేశారు. జోగిరమేష్ సహా మరికొందరికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేత పోలీసుల విచారణకు హాజుకావాల్సి ఉంది. అయితే మాజీ మంత్రి విచారణకు హాజరుకావడం లేదని జోగిరమేష్ తరపు న్యాయవాదులు పోలీసులకు తెలియజేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణను ఓపెన్ చేసిన పోలీసులు గత శుక్రవారం జోగి రమేష్‌ను మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో గంటన్నర పాటు విచారణ చేశారు. ఆయన ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం జోగిని పోలీసులు ఇంటికి పంపించివేశారు. అయితే ఈరోజు మరోసారి విచారణకు రావాల్సిందిగా జోగిరమేష్‌తో మరికొందరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
Kolkata doctor Case: రంగంలోకి ఆ సీబీఐ అధికారి.. న్యాయంపై అభయ తల్లిదండ్రుల విశ్వాసం..!
గత శుక్రవారం విచారణకు వచ్చిన జోగిరమేష్ తన కుమారుడి అరెస్ట్‌పై మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ భూముల విషయంలో తన కుమారుడిని రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు. అలాగే అందరూ ఎలాగైతే కొన్నామ్మో.. తాము అలాగే భూములను కొన్నామంటూ మాజీ మంత్రి మాట్లాడారు. ఈ క్రమంలో ఎవరెవరు కొన్నారనే దానిపై విచారణ జరిపేందుకు మరోసారి జోగికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొదటి సారి విచారణ చేసి పంపించిన పోలీసులు.. మరోసారి విచారణకు రావాలని చెప్పడంతో.. జోగిని అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
TG Bharath: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్
YS Jagan: జగన్ కేసులపై విచారణ మరోసారి వాయిదా
Read Latest AP News And Telugu News