Share News

Gorantla Butchaiah: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య

ABN , Publish Date - Jun 20 , 2024 | 05:23 PM

అసెంబ్లీ సమావేశాలు రేపటి( శుక్రవారం) నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) రాజ్‌భవన్‌లో ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.

Gorantla Butchaiah: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య
Gorantla Butchaiah Chowdary

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు రేపటి( శుక్రవారం) నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) రాజ్‌భవన్‌లో ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.


GOR-5.jpg

బుచ్చయ్య చౌదరితో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎల్లుండి నుంచి రెండురోజుల పాటు ప్రొటెం స్పీకర్‌గా 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం చంద్రబాబు గోరంట్లకు ఈ అవకాశం కల్పించారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు.

Updated Date - Jun 20 , 2024 | 06:37 PM