Share News

Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి నాలుగు ఐకానిక్ ప్రాజెక్టులు

ABN , Publish Date - Sep 27 , 2024 | 09:43 PM

వంద రోజుల్లోనే పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదేళ్లు అశాంతితో గడిపామని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు.

Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి నాలుగు ఐకానిక్ ప్రాజెక్టులు
Minister Kandula Durgesh

అమరావతి: వంద రోజుల్లోనే పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదేళ్లు అశాంతితో గడిపామని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1000 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.


ALSO READ: YS Jagan: నా మతం మానవత్వం.. వైఎస్ జగన్ సంచలనం

రూ. 500 కోట్ల రూపాయలతో అమరావతిలోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని వివరించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి నాలుగు ఐకానిక్ ప్రాజెక్టులను గుర్తించామని చెప్పారు. శ్రీశైలం, సూర్యలంక, అఖండ గోదావరి, మహా సంగమేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి అక్టోబర్ 15 తేదీ లోగా డీపీఆర్ తయారు చేస్తామని అన్నారు. రెండు సంవత్సరాల్లోపు ఈ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని అన్నారు.


ALSO READ: Anam Ramanarayana: సంతకం పెట్టాల్సిందే.. లేకపోతే అడుగుపెట్టనివ్వం

గతంలో చంద్రబాబు సాధించిన అభివృద్ధిని తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకపరంగా అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఔత్సాహకులు ముందుకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడిప్పుడే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కృషి కోసం అందరి కలిసి రావాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu: జగన్‌ తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది

YS Jagan: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్

YS Sharmila: డిక్లరేషన్‌పై మీడియా ప్రశ్న.. షర్మిల సమాధానం ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 09:46 PM