Nara Lokesh: వంగవీటి రాధా నారా లోకేష్ భేటీ..కారణమిదే.
ABN , Publish Date - Oct 22 , 2024 | 05:45 PM
వంగవీటి రాధా ఇంటికి మంత్రి నారా లోకేష్ ఈరోజు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాధా త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.
అమరావతి: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇవాళ(మంగళవారం) వంగవీటి రాధాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన రాధాకృష్ణ కోలుకుంటున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రి లోకేష్ విజయవాడకు చేరుకున్నారు. తాడేపల్లి మండలం ప్రాతూరులోని వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.
గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం
కాకినాడ: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్‌కి డ్రాయర్, బనియన్ పార్సిల్ పంపిస్తున్నానని ఎద్దేవా చేశారు. ముందు ఒంటిమీద బట్టలు వేసుకుని గోరంట్ల మాధవ్ మాట్లాడితే బాగుంటుందని సెటైర్లు గుప్పించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించే హక్కు, స్థాయి మాధవ్‌కు లేదని ధ్వజమెత్తారు. అదనంగా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు కాలం తీసుకున్న వ్యక్తి జగన్ అని చెప్పారు. సూపర్ సిక్స్‌పై విమర్శలు చేస్తున్న మాధవ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని వర్మ వార్నింగ్ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌ను గ్రాండ్‌గా అమలు చేస్తుందని అన్నారు. అరగంట సమయం తీసుకునే వైసీపీ నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను విమర్శించే స్థాయి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తామని వర్మ తీవ్రంగా హెచ్చరించారు.
ఏపీని జగన్ అంధకారంలో నెట్టివేశారు: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి
కడప: ఏపీని మాజీ సీఎం జగన్ అంధకారంలో నెట్టివేశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందుల పట్టణంలో వీధిలైట్లు వెలగడం లేదని చెప్పారు.. ఈ విషయంపై పులివెందుల మున్సిపాలిటీ, విద్యుత్ అధికారులతో చర్చించారు. జగన్ ప్రభుత్వంలో రూ.27 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకు పోవడం వల్లే నేడు పులివెందుల అంధకారంలో ఉందని చెప్పారు. పులివెందులను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పిన జగన్ రెడ్డి అధ్వానంగా తయారుచేశారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విమర్శించారు.
అభివృద్ది ఫేరుతో కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అంధకారంలోకి నెట్టేశారని అన్నారు. నేడు రూ.27 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. లైట్లు వెలగకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం లైట్లు ఆపివేసిందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. వారం రోజుల లోపుల లైట్లు వెలిగించాలనివిద్యుత్ అధికారులను ఆదేశించారు. లేనిపక్షంలో కూటమి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వద్ద ఆందోళన చేపడతామని రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: మెటాతో ఎంవోయూ ఒక మైలురాయి
AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే
Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్
Read Latest AP News And Telugu News