Share News

Minister Savitha: త్వరలో నూతన ఏపీ టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ..

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఏపీ టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత(Minister Savitha) తెలిపారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వల్ల పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని ఆమె చెప్పారు.

Minister Savitha: త్వరలో నూతన ఏపీ టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ..
AP Handloom and Textiles Minister Savitha

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఏపీ టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత(Minister Savitha) తెలిపారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వల్ల పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని ఆమె చెప్పారు. రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడిదారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జౌళి పరిశ్రమల ప్రతనిధులు పాల్గొనగా.. కంపెనీల ఇబ్బందులు, సమస్యల గురించి సవిత అడిగి తెలుసుకున్నారు. నూతన పాలసీలో ఎలాంటి అంశాలను పొందుపరచాలో చెప్పాలంటూ వారి నుంచి పలు సలహాలు తీసుకున్నారు.


టెక్స్‌టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత చెప్పారు. పరిశ్రమల ఏర్పాటును పోత్సహించేలా మౌళిక వసతుల కల్పనతోపాటు రాయితీలూ విరివిరిగా అందజేస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తి పెంచేందుకు ఏపీ కొత్త టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. 2018-23 కోసం ఈ పాలసీని గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని, అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం దాన్ని పక్కన పడేసిందని మంత్రి పేర్కొన్నారు.


వైసీపీ ప్రభుత్వ తీరుతో నూతన పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మంత్రి సవిత వివరించారు. ఈ సందర్భంగా నూతన పాలసీ గురించి నూతన పెట్టుబడిదారులు, పలు కంపెనీల ప్రతినిధులకు ఆమె వివరించారు. అలాగే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టెక్స్ టైల్ పరిశ్రమల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు. నూతన పాలసీతో ఏపీ టెక్స్‌టైల్ రంగం మరింత ముందుకు సాగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.


ఏపీలో 9 టెక్స్ టైల్, అపెరల్ పార్కులు ఉన్నట్లు మంత్రి సవిత చెప్పారు. వాటిలో ఆరు ప్రభుత్వ రంగంలో, మిగిలిన మూడు ప్రైవేటు రంగంలో ఉన్నాయని తెలిపారు. 146 మెగా టెక్స్‌టైల్ ఇండస్ట్రీలు, 18,500 యూనిట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో 15టెక్నికల్ టెక్స్‌టైల్ కంపెనీల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, మూడు ఇండస్ట్రీస్ కారిడార్లు ఉన్నాయన్నారు. దేశంలో సిల్క్ ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో, కాటన్ ఉత్పత్తిలో ఆరో స్థానంలో, జనపనార ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉన్నట్లు మంత్రి సవిత తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న పవిత్రోత్సవాలు

YS Sharmila: ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు

Updated Date - Aug 19 , 2024 | 04:58 PM