Mp Krishnadevarayalu: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 29 , 2024 | 06:32 PM
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఎంతో అవసరమని టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని చెప్పారు. పార్లమెంట్లో బడ్జెట్‌పై చర్చలు జరిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ చేయూత ఎంతో అవసరమని టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Mp Lavu Krishnadevarayalu) వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో బడ్జెట్‌పై సోమవారం నాడు చర్చలు జరిపారు. కేంద్ర బడ్జెట్‌పై లావు శ్రీకృష్ణదేవరాయలు పలు కీలక విషయాలను పంచుకున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన శూన్యమని చెప్పారు. అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీశారని శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు.
Also Read: Midhun Reddy: ఏపీకి ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలి
కాంగ్రెస్ ఆ విషయం మర్చిపోయింది..
2014 -19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జలవనరులు, రహదారుల కల్పనకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా ఏం కేటాయించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విభజన చట్టాన్ని తయారు చేసిందన్నారు. ఏపీకి చట్టంలో ఇచ్చిన హామీల గురించి మర్చిపోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏపీని అశాస్త్రీయంగా విభజించారని.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి, పోలవరానికి కేటాయింపులు జరిపారని గుర్తుచేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 94లోనే అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని ఉందని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
Also Read: Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు
ప్రతిపక్షాలు విస్మరించడం తగదు..
విభజన చట్టంలోని సెక్షన్19లో పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధికి సెక్షన్ 94(1), వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి సెక్షన్ 94(2) ప్రకారం నిధులు కేటాయించాలని విభజన చట్టంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రతిపక్షాలు విస్మరించడం తగదని అన్నారు. సమాఖ్య స్పూర్తితోనే ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధులను కేటాయించారని గుర్తుచేశారు. యుపీఏ ప్రభుత్వానికి ఏపీ 2009లో 33 లోక్‌సభ స్థానాలు, 2004లో 29 స్థానాలిస్తే అందుకు బదులుగా రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీ రూ.24వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందన్నారు. 2019 నాటికి ఏపీ రూ. 3.75 లక్షల కోట్ల అప్పు ఉంటే.. అది 2024 నాటికి రూ.9.74 లక్షల కోట్లకు చేరిందని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారు..
గత టీడీపీ హయాంలో జలవనరుల శాఖలో రూ. 47వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ హయాంలో కేవలం రూ.20వేల కోట్లే ఖర్చు చేశారని చెప్పారు. రహదారుల నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వంలో రూ. 8, 800 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ ప్రభుత్వంలో రూ. 1, 350 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు పెట్టామన్నదే ముఖ్యమని అన్నారు. అనవసర ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సాయం తప్పనిసరి అని లావు శ్రీకృష్ణదేవరాయలు ఉద్ఘాటించారు.
చదువుకు, నాయకత్వానికి సంబంధం లేదు..
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హార్వర్డ్, కేంబ్రిడ్జిలలో చదవలేదంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కామరాజర్ ఏమీ చదువుకోకపోయినా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆదర్శ నేతగా ఎదిగారని కొనియాడారు. చదువుకు, నాయకత్వానికి సంబంధం లేదన్న విషయం ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. మూడోసారి ప్రధాని అయిన మోదీకి అభినందనలు తెలిపారు. వరుసగా 6వ సారి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం హర్షణీయమని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vasantha Krishna Prasad: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజలకు మంచి చేద్దాం..
Minister Nimmala: మంత్రి సాహసం.. స్వయంగా అక్కడికి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి..
Purandeswari: ఏపీలో పథకాల మార్పుపై ఎంపీ పురందేశ్వరి ఏమన్నారంటే?
Read Latest AP News And Telugu News