High Court: పెనక నేహారెడ్డి గోడ కూల్చివేత ఖర్చులపై హైకోర్టు ఆరా...
ABN , Publish Date - Sep 11 , 2024 | 06:48 PM
విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు తమ వాదనలను కోర్టుకు వివరించాయి. పెనక నేహారెడ్డి భీమిలి బీచ్‌లో నిర్మించిన కొంత గోడను అధికారులు కూల్చినట్లు జీవీఎంసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే అందుకైన ఖర్చులు ఎవరు భరించారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. జీవీఎంసీ ఖర్చులతోనే కూల్చినట్లు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
అయితే కూల్చివేతలకు అయిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను సమర్పించాలని జీవీఎంపీ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. మిగిలిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ ప్రశ్నించగా.. మూడ్రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ నేహారెడ్డికి నోటీసులిచ్చినట్లు జీవీఎంసీ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను వచ్చే బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా భీమిలి బీచ్‌లో నేహారెడ్డి నిర్మాణాలు చేపడుతున్నారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Minister Ravindra: వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది..
Minister Anagani: ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారు..
జైలు బయట మాజీ సీఎం జగన్ సెల్ఫీలు..
వాటర్ ట్యాంక్‌పై వినాయకుడు.. ఐడియా అదిరింది..