AP News: నాగార్జున యూనివర్సిటీ ఘటనపై కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం..
ABN , Publish Date - Nov 30 , 2024 | 02:00 PM
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ నిరసన చేపట్టారు. భోజనంలో వారం క్రితం కాళ్లజెర్రి వచ్చిందని, నాలుగు రోజుల క్రితం కప్ప వచ్చిందని విద్యార్థినిలు ఆరోపించారు.
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఘటనపై విచారణకు చంద్రబాబు సర్కార్ ప్రత్యేక కమిటీని నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా నేతృత్వంలో ఎంక్వైరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జిల్లా పౌరసరఫరాల అధికారిణి కోమలి, ఫుడ్ కంట్రోలర్ రవీంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇవాళ(శనివారం) యూనివర్శిటీ వసతి గృహానికి చేరుకున్న కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. విద్యార్థినిలతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఆహారంలో పురుగులు, కప్ప, కాళ్లజెర్రులు రావడంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ నిరసన చేపట్టారు. భోజనంలో వారం క్రితం కాళ్లజెర్రి వచ్చిందని, నాలుగు రోజుల క్రితం కప్ప వచ్చిందని విద్యార్థినిలు ఆరోపించారు. రెండ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం రాత్రి 9 నుంచి తెల్లవారుజాము వరకూ ఆందోళనకు దిగారు.
వర్సిటీలోని మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి వీసీ చాంబర్ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వందలాది మంది విద్యార్థినులు ధర్నాలో పాల్గొనగా.. విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో విచారణకు ఆదేశించింది. అప్పటికప్పుడే హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేసింది. తాజాగా ఘటనపై విచారణకు కమిటీని సైతం నియమించి విచారణ జరుపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఫెంగల్ తుఫాన్.. సీఎం చంద్రబాబు ఆదేశాలివే
Vijayawada: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. ప్రియుడి కోసం యువతి ఎంత పని చేసిందంటే..