Share News

Jagan: 20ఏళ్ల పిల్లాడిని నిర్ధాక్షణ్యంగా కొట్టారు..

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:12 PM

Andhrapradesh: 20ఏళ్ళ పిల్లాడు అజయ్‌ను నిర్ధాక్షణ్యంగా కొట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత అజయ్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన వ్యక్తి అని అదే పనిగా వాహనాల్లో వచ్చి దాడి చేసి ఆసుపత్రి పాలు చేశారని అన్నారు.

Jagan: 20ఏళ్ల పిల్లాడిని నిర్ధాక్షణ్యంగా కొట్టారు..
Former CM YS Jagan Mohan Reddy

కడప, జూలై 6: 20ఏళ్ళ పిల్లాడు అజయ్‌ను నిర్ధాక్షణ్యంగా కొట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీ నేతల (TDP Leaders) దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత అజయ్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన వ్యక్తి అని అదే పనిగా వాహనాల్లో వచ్చి దాడి చేసి ఆసుపత్రి పాలు చేశారని అన్నారు. పులివెందులలో ఇలాంటి సాంప్రదాయం గతంలో ఎన్నడూ లేదని ఆయన విమర్శించారు.

Gold: అతి తెలివితో నగలు కొట్టేసిన మహిళలు... కంగుతిన్న యాజమాన్యం


ఎన్నికల తర్వాత అంతా కలిసి ఉండే పరిస్థితి ఉంటుందని.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ సంప్రదాయానికి తిలోదకాలు పలికి చెడు సాంప్రదాయానికి తెరలేపారన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎన్నడూలేదని.. తమరు వేసే బీజం చెడు సాంప్రదాయమంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు భయాందోళన వాతావరణం సృస్టించాలని చూస్తున్నారని.. ఇప్పటికైనా ఆపాలని హితవుపలికారు. అధికారంలో ఉండి చేసిన ఈ సంప్రదాయ పాపాలు చంద్రబాబుకు చుట్టుకుంటాయని హెచ్చరించారు. ‘‘చంద్రబాబును హెచ్చరిస్తున్నా ఈ సంప్రదాయం ఆపండి.. వ్యవస్థను గాడిలో పెట్టండి’’ అంటూ హితవులపికారు.

Big Breaking: గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా?


బాబు మోసపురిత వాగ్దానాలు నమ్మి ఓట్లేశారన్నారు. రుణ మాఫీ అన్నారని... మహిళకు నగదు అన్నారని... అవి చూసుకోవాలని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికి ఇంటికి ఉద్యోగం అన్నారు అది చేయాలన్నారు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని... ఇంత వరకు స్కూల్ బాగ్స్ అందించలేదని విమర్శించారు. అతిసారతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న పాపానపపోలేదని జగన్ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

Maheswar Reddy: ఓటమి భయంతోనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించట్లే

Satyakumar: ఏపీలో గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం...


Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 03:15 PM