Share News

BTech Ravi: ఆ భయంతోనే పులివెందులలో మెడికల్ కాలేజీ ప్రారంభం

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:14 AM

Andhrapradesh: పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి నిన్న (సోమవారం) మెడికల్ కాలేజీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందిస్తూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి లేదని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీని సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారని విమర్శించారు.

BTech Ravi: ఆ భయంతోనే పులివెందులలో మెడికల్ కాలేజీ ప్రారంభం

కడప, మార్చి 12: పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి (CM Jaganmohan Reddy) నిన్న (సోమవారం) మెడికల్ కాలేజీని (Pulivendula Medical Collage) ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ ర (Pulivendula TDP Candidate BTech Ravi) స్పందిస్తూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి లేదని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీని సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారని విమర్శించారు. అసంపూర్తిగా మెడికల్ కాలేజీని ఆగమేఘాలపై ప్రారంంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందనే భయంతోనే సీఎం మెడికల్ కాలేజిని ప్రారంభించారని మండిపడ్డారు. పులివెందులలో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారని ఆరోపించారు. పులివెందులలో బీజేపీ, జనసేనలతో (BJP - Janasena) కలిసి ప్రచారం (Election Campaign) మొదలుపెడతామని బీటెక్ రవి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

AP Politics: ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు..

IPL2024: జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా.. వీడియో షేర్ చేసిన ముంబై ఇండియన్స్


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 11:23 AM