Share News

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు..

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:12 AM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో మరుగుదొడ్లపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజిలో సరిపడా మరుగుదొడ్లు ఉన్నాయా అంటే మంత్రి ఉన్నాయని అంటున్నారని..

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు..
AP Assembly Session

అమరావతి, జూలై 25: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు(AP Speaker Ayyannapatrudu) ప్రశ్నోత్తరాల మొదలుపెట్టారు. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో మరుగుదొడ్లపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు (MLA Vishnukumar Raju) మాట్లాడారు. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో సరిపడా మరుగుదొడ్లు ఉన్నాయా అంటే మంత్రి ఉన్నాయని అంటున్నారని.. అయితే పరిస్ధితులు వేరుగా ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వాన్ని తాను దుర్మార్గపు ప్రభుత్వం అన్నందుకు జైలులో పెట్టారని, ఇప్పుడు బెయిల్‌పై ఉన్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ, ఎమ్మార్వో ఆఫీసు, రైతు బజార్ , ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌ను తాకట్టు పెట్టేశారని విష్ణుకుమార్ రాజు తెలిపారు.

AP Politics: నెలరోజుల్లోనే వివాదాలు.. వైసీపీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత..


విశాఖ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ప్రఖ్యాతి గాంచిన కాలేజ్ అని... ఇందులో అన్ని కోర్సులు ఉన్నాయన్నారు. 23 ఎకరాల 38 సెంట్ల విస్తీర్ణంలో కాలేజీ ఉందన్నారు. ఈ మధ్యకాలంలో పిల్లలు మంచినీళ్లు కూడా తాగకుండా కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. సరైన టాయిలెట్స్ లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. కాలేజీ యాజమాన్యాలు భయపడి అసలు విషయాలను దాచేస్తున్నారని... ఉన్న వాస్తవాలు కూడా చెప్పకపోతే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని అన్నారు.


పాలిటెక్నిక్ కాలేజ్‌లో 1169 మంది అబ్బాయిలు చదుకుంటుండగా వారికి 59 టాయిలెట్స్ అవసరం ఉండగా కేవలం 14 మాత్రమే ఉన్నాయన్నారు. అలాగే 538 మంది అమ్మాయిలు చదువుకుంటున్నారని వారికి 27టాయిలెట్స్ అవసరం ఉండగా కేవలం14 టాయిలెట్స్ ఉన్నాయని తెలిపారు. కేవలం పాలిటెక్నిక్ కాలేజీలోనే కాదు... ప్రైవేటు స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉందని.. దీనిపై మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించాలని విష్ణుకుమార్ రాజు కోరారు.

USA: భారత్‌లోని ఈ నగరాలకు వెళ్లకూడదు.. అమెరికా హెచ్చరిక


దీనిపై మంత్రి నారా లోకేష్‌ సమాధానం ఇస్తూ.. విశాఖలోని పాలిటెక్నిక్ కాలేజీలో టాయిలెట్స్ షార్టెజ్ ఉందని.. త్వరలోనే ఈ షార్టెజ్ లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా వ్యవస్ధలు భ్రష్టుపట్టాయని.. వాటిని క్రమంగా సెట్ చేసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దారి తప్పిన వాటిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒక నెలరోజులు అధికారులకు టైం ఇచ్చామని.. ఈలోగా దారితప్పిన వ్యవస్ధను గాడిలో పట్టాలని చెప్పినట్లు తెలిపారు. తప్పకుండా యూనివర్సిటీల దగ్గర నుంచి కేజీల వరకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: స్మితాసబర్వాల్‌ క్షమాపణ చెప్పాలి...

AP Politics: వైసీపీకి వరుస రాజీనామాలు.. దేనికి సంకేతం..?

Read Latest AP News And Telangana News

Updated Date - Jul 25 , 2024 | 11:26 AM