Share News

Pawan Kalyan: ముంబై పెళ్లిలోనూ జనసేన గెలుపుపైనే చర్చ

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:50 PM

Andhrapradesh: జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచిందని.. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే.. అందరూ ఇదే విషయాన్ని అడిగారని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన విజయం గొప్ప విజయమని చెప్పుకొచ్చారు. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్లు తట్టుకోలేకపోయేవారన్నారు.

Pawan Kalyan: ముంబై పెళ్లిలోనూ జనసేన గెలుపుపైనే చర్చ
Deputy CM Pawan Kalyan

అనరావతి, జూలై 15: జనసేన Janasena) పోటీ చేసిన ప్రతి సీటును గెలిచిందని.. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే.. అందరూ ఇదే విషయాన్ని అడిగారని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన విజయం గొప్ప విజయమని చెప్పుకొచ్చారు. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్లు తట్టుకోలేకపోయేవారన్నారు. ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారని.. కానీ ఒక్క స్థానం లేకున్నా.. పట్టుదలతో పని చేశామని తెలిపారు. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు.. కానీ 164 రావడానికి జనసేన వెన్నెముకగా మారిందని పవన్ పేర్కొన్నారు.

Rajya Sabha Majority Mark: రాజ్యసభలో మెజారిటీ దిగువకు పడిపోయిన ఎన్డీయే ఎంపీల సంఖ్య!.. వైసీపీ సాయం కావాల్సిందే?



బాధ్యతలు అప్పగిస్తా...

గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయ పడే పరిస్థితి ఉండేదని, వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారన్నారు. గతంలో సాక్షాత్తూ ఓ ఎంపీనే సీఐడీ కార్యాలయంలో కొట్టారని గుర్తు చేశారు. అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వం హయాంలో జరిగిందని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చామన్నారు. జనసేన పోటీ చేయని చోట్ల కూడా జనసేన మిత్రపక్ష అభ్యర్థులకు అండగా నిలిచారన్నారు. జనసేన రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పని చేశారన్నారు. పొట్టి శ్రీరాములు, డొక్కా సీతమ్మ ప్రేరణతో పని చేస్తున్నామని తెలిపారు. పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నామని.. కీలక శాఖలు తీసుకున్నామన్నారు. సరైన సమయంలో అందరికీ బాధ్యతలు అప్పగిస్తానని డిప్యూటీ సీఎం ప్రకటించారు.


వాళ్లు మనకు శత్రువులు కాదు..

140 కోట్ల ప్రజల భారాన్ని మోసే ప్రధానికి సాయంగా నిలవాలన్నారు. పోటీ చేయని నేతలూ పార్టీ కోసం పని చేశారన్నారు. ఎంత సాధించినా ఒదిగి ఉండడం మంచిదని కార్యకర్తలకు సూచించారు. ఎన్ని స్థానాలు మనకున్నాయని కాదు.. ఎంత బలంగా చేశామనేది ముఖ్యమన్నారు. తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత జరిగిన సభలో జోష్ తగ్గిందన్నారు.. కానీ ఫలితాలు అద్భుతంగా వచ్చాయన్నారు. 7 శాతం నుంచి 20 శాతం ఓటింగ్ పెరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భంలో కూడా ఈ స్థాయిలో గెలుపు వచ్చిందని వెల్లడించారు. మెజార్టీలు రాలేదని అయ్యన్న అన్నారని తెలిపారు. వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదని.. ప్రత్యర్థులు మాత్రమే అని స్పష్టం చేశారు. కక్ష సాధింపులు వద్దని.. వ్యక్తిగత దూషణలు వద్దని.. అలాగని తామేమీ వెనక్కు తగ్గినట్టు కాదన్నారు. యుద్దం అనివార్యమే అయితే సిద్ధమే అని పవన్ స్పష్టం చేశారు.

SBI Interest Rates: ఎస్‌బీఐ అనూహ్య నిర్ణయం.. పెరగనున్న ఈఎంఐలు!


అలా చేస్తే.. వదులుకోడానికి సిద్ధం..

‘‘వైసీపీ చేసిన తప్పులు మనం చేయొద్దు. ప్రజల కోసం పదవులు పక్కన పెట్టి పని చేయడానికి సిద్దం. వివిధ శాఖల రివ్యూలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఏ శాఖలోనూ డబ్బుల్లేవు. ప్రజాధనంతో రిషికొండ ప్యాలెస్ కట్టారు. ఫర్నిచర్ కోసం.. ఆడంబరాల కోసం పెద్దగా ఖర్చేం పెట్టొద్దని చెప్పాను. ప్రతి రోజూ ఒక్క ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చేయొద్దు. రౌడీయిజాన్ని నమ్మొద్దు. దురుసుగా మాట్లాడ్డం.. బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా సీరియస్ యాక్షన్ ఉంటుంది. సంస్కరించాల్సిన మనమే.. తప్పులు చేయకూడదు. ఎప్పుడూ ఓటేయని వాళ్లు వచ్చి మరీ ఓటేశారు. మన మీద ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు’’ అని జనసేన అధినేత తెలిపారు.


ఆ భ్రమలో నేను లేను..

‘‘నేను లేకపోతే పార్టీ ఏదో అయిపోతుందని.. రాజకీయం ఉండదని నేను అనుకోవడం లేదు. జనసేన లేకుంటే ఏపీ రాజకీయాలు ఉండవనే భ్రమలోనూ లేను. జనసేన నేతలు.. కార్యకర్తలు కూడా నా తరహాలోనే ఆలోచించాలని కోరుకుంటున్నాను. విర్రవీగినందుకు వైసీపీ లాంటి పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జనం కోసం నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. దెబ్బతినడానికి సిద్దంగా ఉన్నాను కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో రాజీ పడను. తమ బిడ్డలే తమ రాజకీయ వారసులనే విధంగా వ్యవహరించ వద్దు. బిడ్డల కోసం ఏదైనా చేయొచ్చు కానీ.. రాజకీయ వారసులు కూడా వాళ్లేననే దిశగా ఆలోచన చేయొద్దు. టీడీపీ, బీజేపీ నేతలను కించపరచొద్దు. ఎవరైనా కామెంట్లు చేసినా దాన్ని వ్యక్తిగతంగానే చూడాలి.. పార్టీలకు ఆపాదించొద్దు’’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: ఇసుక అక్రమాలపై నివేదిక ఇవ్వండి... సుప్రీం ఆదేశం

Minister Nadendla: పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 03:24 PM