Share News

Kollu Ravindra: వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:09 PM

గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్వం చేసి వారికి ఇష్టమెుచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు.

Kollu Ravindra: వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..
Minister Kollu Ravindra

కృష్ణా: గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్వం చేసి వారికి ఇష్టమెుచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు. ముఖ్యంగా కొంతమంది పోలీసులు అయితే వైసీపీ కార్యకర్తల్లా పని చేశారని మండిపడ్డారు. అన్యాయంగా కూటమి నేతలపై కేసులు పెట్టారని, జైళ్లల్లో వేధింపులకు గురి చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం 50రోజులకు పైగా జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురి చేశారని మండిపడ్డారు. మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర చర్చించారు.

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక.. కొత్త అధ్యక్షుడు ఎవరంటే?


పోలీసులను వైసీపీ కార్యకర్తల్లా వాడుకున్నారు..

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలను జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అసలు పరిపాలనే లేకుండా చేశారు. నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాశారు. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్టిన బూతు పురాణాన్ని ప్రజలు విన్నారు. అందుకే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 90శాతానికి పైగా విజయంతో ప్రజలు కూటమికి పట్టం కట్టారు. పోలీసు సిబ్బందిని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ కార్యకర్తల్లాగా మార్చుకున్నారు.


బదిలీలు, చర్యలు పేరుతో వారిని భయపెట్టి ఇష్టం వచ్చినట్లుగా పని చేయించుకున్నారు. కొంతమంది పోలీసులు అయితే పూర్తిగా వైసీపీ నాయకుల్లా పని చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు చట్టప్రకారమే పని చేస్తారని హామీ ఇస్తున్నా. అధికారులు కూడా అడ్డగోలుగా పని చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన అధికారులపై భవిష్యత్‌లో చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

AP News: వైసీపీ హయాంలో సర్పంచ్‌లను వేధించారు: వైవీబీ రాజేంద్రప్రసాద్


కల్తీ మద్యంతో పేదల ప్రాణాలు తీశారు..

జగన్ హయాంలో అక్రమ మద్యం, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగింది. డిస్టిలరీలను నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం సొంత కంపెనీలు, బ్రాండ్లు సృష్టించి ప్రజలను మత్తుకు బానిసలుగా చేశారు. పేదల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు. కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు. వీరి విధానాల వల్లే ఏపీలో గంజాయి, అక్రమ మద్యం పెరిగిపోయింది. రాష్ట్రంలో ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండవు.


ఏపీలో 4,380మద్యం షాపులను 2,934కు తగ్గించినట్లే తగ్గించి మళ్లీ 3,392కు పెంచారు. అమ్మకాల్లో రూ.99వేల కోట్లు నగదు రూపంలోనే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో వెల్లడయ్యింది. వైసీపీ ప్రభుత్వం కల్తీ లిక్కర్‌తో పేదల జీవితాలను చిదిమేసింది. ఇకపై రాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు స్వస్తి పలుకుతాం. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకు వెళ్తుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.

ఈ వార్త కూడా చదవండి:

Devineni Uma: జగన్‌కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదా?: దేవినేని ఉమా..

Updated Date - Jul 27 , 2024 | 06:12 PM