Share News

AP Govt: ఏపీలో హైడ్రా తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

ABN , Publish Date - Sep 19 , 2024 | 04:36 PM

త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

AP Govt: ఏపీలో  హైడ్రా తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
Minister Kolusu Parthasarathy

గుంటూరు జిల్లా: తెలంగాణ రాష్ట్రం తరహాలో ఏపీలో కూడా హైడ్రాను తీసుకువస్తామని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఏపీలో కూడా చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఆరోపించారు. ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.


వైసీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు.


ALSO Read: kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన నటి కాదంబరి జెత్వాని

బుడమేరు అక్రమణలపై చర్యలు: మంత్రి నిమ్మల రామానాయుడు

విజయవాడ: బుడమేరు అక్రమణలపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు ప్రహహించే చుట్టుపక్కల ప్రాంతాల్లో 3051 ఆక్రమ నిర్మాణాలు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చాలా వరకూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. ఈరోజు ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... వెలగలేరు హెడ్ రెగ్యూలేటర్ నుంచి ఓల్డ్ ఛానల్ వైపు బుడమేరు వెళ్తుందని అన్నారు. ఇది వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరిపాడు, గొల్లపూడి, విద్యాధరపురం, విజయవాడ 14, 15, 16 రెవెన్యూ వార్డులు, గుణదల, రామవరపాడు, ప్రసాదంపాడు మీదుగా ఎనికేపాడు వరకు మొతం 36.2 కిలో మీటర్ల వార్డులు ఉన్నాయని చెప్పారు. అలాగే కొన్ని గ్రామాల్లో కూడా బుడమేరు ఆక్రమణలు ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Minister-Nimmala.jpg


ALSO Read:Kadambari Jethwani: హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?

ఈ ఆక్రమణల్లో చాలా వరకూ అగ్రికల్చర్ కోసం జరిగినవేనని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వీఎంసీ పరిధిలో 202 ఎకరాల్లో 70 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని అన్నారు. బుడమేరు విస్తారణ నేపథ్యంలో ఎంతమేరకు ఆక్రమణలు జరిగాయనేది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. చీమల వాగు, కేసరపల్లి, ఎనికేపాడు యూటీల సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.


ALSO Read:YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!

ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకూ గండ్లను పూడ్చాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. బుడమేరు ఓల్డ్ ఛానల్ విజయవాడ నగరం మధ్య నుంచి వస్తోందని అన్నారు. దీనికి సమాంతరంగా ఉన్న కెనాల్‌ను విస్తరించడం ద్వారా బుడమేరు ప్లడ్ వాటర్‌ను డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. పాములు కాలవ, ముస్తాబాద్ కెనాళ్ల పరిధి పెంచుతామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Nagababu: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..

Dola Anjaneyulu: పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా జగన్ పాపాలు బయటకు....

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 19 , 2024 | 04:48 PM