Share News

Lokesh: వారి ఆనందమే కూటమి సర్కార్‌కు వెలకట్టలేని బహుమానం

ABN , Publish Date - Aug 01 , 2024 | 01:43 PM

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జరుగుతోంది. వేకువజాము నుంచే ఎమ్మెల్యేలు, అధికారులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు’’...

Lokesh: వారి ఆనందమే కూటమి సర్కార్‌కు వెలకట్టలేని బహుమానం
Minister Nara Lokesh

అమరావతి, ఆగస్టు1: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జరుగుతోంది. వేకువజాము నుంచే ఎమ్మెల్యేలు, అధికారులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు. పింఛన్లు అందుకున్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే మాకు ఆశీస్సులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాదిమంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి అందిన వెలకట్టలేని బహుమానం’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Chinta mohan: ఏపీ అప్పులపై నిజనిర్ధారణ కమిటీకి చింతామోహన్ డిమాండ్


మాటకు కట్టుబడి పెన్షన్ల పంపిణీ: కదిరి ఎమ్మెల్యే

గతంలో మాట తప్పను అని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు.ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు. లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం ప్రస్ఫుటంగా కనబడుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతున్నదని తెలిపారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తోందన్నారు. 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బావుంటుందని ప్రజలు గ్రహించారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వందకు వంద శాతం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం,అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ పేర్కొన్నారు.

TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..


అలాగే... కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పలు వార్డ్‌లలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి పంపిణీ చేశారు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టేశారన్నారు. కూటమి ప్రభుత్వం లో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చి ప్రజల్లో ఆనందం నింపుతారని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే డా. పాశిం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉదయం 6.00 గంటల నుంచే ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

Venkataprasad: 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజల్లో ఆనందం...

August Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు అంటే..?

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 01:55 PM