Share News

Lokesh: రెడ్‌ బుక్ తెరవకముందే ఢిల్లీలో గగ్గోలు.. జగన్‌పై లోకేష్ ఎద్దేవా

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:34 PM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నాడు లోకేష్‌ను పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

Lokesh: రెడ్‌ బుక్ తెరవకముందే ఢిల్లీలో గగ్గోలు.. జగన్‌పై లోకేష్ ఎద్దేవా
Minister Nara Lokesh

అమరావతి, జూలై 26: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌కు (Minister Nara lokesh) వినతులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నాడు లోకేష్‌ను పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తన దగ్గర రెడ్ బుక్ (Lokesh Red Book) ఉందని తానే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పానన్నారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

Jaggareddy: పత్తాలాట మాకు రాదు.. ఆ రెండు పార్టీలకే వస్తాయన్న జగ్గారెడ్డి


ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్ళిపోయారన్నారు. రెడ్‌బుక్‌కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి, పిలిపించి మరీ ప్రచారం కల్పించారంటూ ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ రెండు మీడియా సమావేశాలు పెడితే... 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ఐదు మీడియా సమావేశాలు పెట్టారని చెప్పుకొచ్చారు. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలు తాము వివరిస్తాం కదా అని అన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామని తెలిపారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరని.. జగన్ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచరని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Revanth Reddy: నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్.. మరో 30 వేల పోస్టుల భర్తీ



ఢిల్లీ ధర్నాలో ఇలా...

కాగా.. ‘‘ఏపీలో హింసాకాండ’’ అంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధించాలంటూ పార్టీ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో హింసాకాండ చెలరేగిపోతోందని.. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏపీలో లోకేశ్‌ రెడ్‌ బుక్‌ పాలన సాగుతోందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ దుయ్యబట్టారు.

ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో జగన్ పదేపదే లోకేష్ రెడ్ బుక్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే వైసీపీ అధినేత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు రెడ్ బుక్ అంటే భయంపట్టుకుందని... ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

YS Jagan: అప్పులపై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు.. శ్వేతపత్రాలపై జగన్ స్పందన

AP News: ఎంతటి దుర్మార్గం... పొలం కౌలుకు తీసుకుని రైతునే గెంటేసిన వైసీపీ నేత

Read latest AP News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 03:37 PM