Share News

Badrinath Yatra: బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు వారు సురక్షితం

ABN , Publish Date - Sep 17 , 2024 | 04:41 PM

Andhrapradesh: బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. యాత్రికులతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలుగు యాత్రికులకు సంబంధించి ఢిల్లీ ఏపీభవన్ అధికారులతో హోంమంత్రి సమన్వయం చేశారు.

Badrinath Yatra: బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు వారు సురక్షితం
Bhadrinath Yatra

న్యూఢిల్లీ , సెప్టెంబర్ 17: బద్రీనాథ్ యాత్రకు (Bhadirnath Yatra) వెళ్లిన తెలుగు యాత్రికులు (Telugu People) సురక్షితంగా ఉన్నారు. యాత్రికులతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home minister Vangalapudi Anitha) మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలుగు యాత్రికులకు సంబంధించి ఢిల్లీ ఏపీభవన్ అధికారులతో హోంమంత్రి సమన్వయం చేశారు. తెలుగు యాత్రికులంతా క్షేమంగా రుద్ర ప్రయాగకు చేరుకున్నట్లు హోంమంత్రికి ఏపీ భవన్ అధికారులు సమాచారం ఇచ్చారు. రుద్ర ప్రయోగం నుంచి ఈరోజు వారి వారి స్వస్థలాలకు బయలుదేరుతున్నట్లు యాత్రికులు సమాచారం పంపారు.

Supreme Court of India: సుప్రీంకోర్టు సంచలన తీర్పు..


కాగా.. బద్రీనాథ్ తీర్ధయాత్రలో తెలుగు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. నిన్న (సోమవారం) సాయంత్రం గోచార రుద్రప్రయాగ దగ్గర కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్ రహదారిని అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి గోచార రుద్రప్రయాగ వద్ద రోడ్డుపైనే తాడిపత్రికి చెందిన 40మంది యాత్రికులు పడిగాపులు కాస్తున్నారు. ఆహారం, మంచినీరు లభించక ఇబ్బందిపడుతున్న పరిస్థితి. తమ పరిస్థితికి సంబంధించి ఏపీ అధికారులకు యాత్రికులు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు.. యాత్రికులను సంప్రదించారు. స్వయంగా హోంమంత్రి అనిత యాత్రికులతో మాట్లాడారు. బద్రీనాథ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇలాంటి బైక్ స్టంట్ ఎక్కడైనా చూశారా.. మొత్తానికి పెద్ద షాకే ఇచ్చాడుగా..


కేదార్‌నాథ్ యాత్రికులు కూడా..

మూడు రోజుల క్రితం కేదార్‌నాథ్ యాత్రలో ( Kedarnath Yatra) చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. కొంత మంది యాత్రికులు గుప్త కాశీకి చేరుకున్నారు. ఆపదలో ఉన్నామని, కిందకు చేరుకోలేక పోతున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని (MP Kalishetti Appalanaidu) పలువురు యాత్రికులు సంప్రదించారు. విషయాన్ని మంత్రి లోకేష్, సీఎం కార్యాలయం దృష్టికి ఎంపీ అప్పలనాయుడు తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్, సీఎం కార్యాలయం ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో యాత్రికులు ఈరోజు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఆపద సమయంలో వెంటనే స్పందించిన మంత్రి లోకేష్‌కు, సీఎం కార్యాలయానికి యాత్రికులు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Sep 17 , 2024 | 04:44 PM