Share News

AP NEWS: దగదర్తి విమానాశ్రయ పనులు త్వరలో ప్రారంభిస్తాం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ABN , Publish Date - Oct 27 , 2024 | 08:18 PM

జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.

AP NEWS: దగదర్తి విమానాశ్రయ పనులు త్వరలో ప్రారంభిస్తాం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు: జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో ఇవాళ(ఆదివారం) మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ... నగరం చుట్టూ ఉన్న రైసు మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామని తెలిపారు.


కృష్ణపట్నం పోర్టు, కిసాన్ సెజ్‌లోకి మార్చాలని భావిస్తున్నామని చెప్పారు. రైసు మిల్లుల అసోసియేషన్లతో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జిల్లాకు భారీ సంఖ్యలో పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. విమానాశ్రయం ఎంతో అవసరం ఉందన్నారు. విమానాశ్రయానికి 1379 ఎకరాల భూములు అవసరమని వివరించారు. విమానాశ్రయం కోసం తీసుకున్నందుకు కొంత భూమికి పరిహారం ఇచ్చారని.. ఇంకా కొంత భూమిని సేకరించాల్సి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.


దగదర్తి విమానాశ్రయం గురించి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు: నారాయణ

narayana-former-minister.jpg

దగదర్తి ఎయిర్ పోర్టుకు టీడీపీ హయాంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. వైసీపీ హయాంలో విమానాశ్రయం గురించి పట్టించుకోలేదని. వేరే ప్రదేశానికి తరలించాలని చూశారని అన్నారు. విమానాశ్రయం గురించి ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించినట్లు తెలిపారు. భూ సేకరణ చేస్తే వెంటనే పనులు ప్రారంభించేలా చూస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. త్వరలోనే ఒక కమిటీని పంపుతామని ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడించారు.


జగన్ రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు: మంత్రి నిమ్మల రామానాయుడు

nimmala.jpg

పశ్చిమగోదావరి: అక్రమ ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జూబ్లీహిల్స్‌లో బంగ్లా, లోటస్ పాండ్, బెంగళూరులో 82 గదుల ప్యాలెసులు జగన్‌కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ‘‘ఈ లక్షల కోట్లు అన్నీ మీ తాత, తండ్రి నీకు ఇచ్చిన ఆస్తులు కాదు కదా’’ అని నిలదీశారు. జగన్ జైలుకెళ్లాడు కానీ షర్మిల జైలుకు వెళ్లలేదు కదా.. అందుకే ఆమెకు ఆస్తుల్లో వాటా రాదని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?

AP Politics: జగన్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే..

Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: పవన్ కళ్యాణ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 27 , 2024 | 08:26 PM