Share News

Minister Narayana: టీడీఆర్ వ్యవహారంలో చాలా అవకతవకలు.. చర్యలు తప్పవు

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:02 PM

టౌన్ ప్లానింగ్‌లో స్పెషల్ డ్రైవ్ నిత్యం కొనసాగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకోని పెండింగ్ పనులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

Minister Narayana: టీడీఆర్ వ్యవహారంలో చాలా అవకతవకలు.. చర్యలు తప్పవు
Minister Narayana

నెల్లూరు: టౌన్ ప్లానింగ్‌లో స్పెషల్ డ్రైవ్ నిత్యం కొనసాగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకోని పెండింగ్ పనులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు 76 పెండింగ్ అనుమతుల్లో 50 క్లియర్ చేశామన్నారు. అన్ని అనుమతులు ఉండి జాప్యం చేస్తున్న పనులను సత్వరమే పరిష్కరిస్తున్నామని వివరించారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు.


ALSO Read: Chandrababu:వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్ల సీమగా మారింది

ఎల్లుండి విశాఖపట్నలో టౌన్ ప్లానింగ్‌పై స్పెషల్ డ్రైవ్ ఉంటుందని చెప్పారు. గురువారం నాడు మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. 2014 లో దేశంలో మొదటి సారి టీడీపీ ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. టౌన్ ప్లానింగ్‌లో శాఖ జాప్యం ఉంది.. ఇక అటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు.


ALSO Read: Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

పురసేవ కార్యక్రమం త్వరలో పునఃప్రారంభం చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీఆర్ వ్యవహారంలో చాలా అవకతవకలు జరిగాయని,, చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీఆర్ అవకతవకలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్పొరేషన్‌లో సంతకాల ఫోర్జరీ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్ది తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. కార్పొరేషన్ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ వ్యవహారంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. 2014 నుంచి 2019 వరకు టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికందరికి ఇళ్లు అందిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.


వైసీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు: యనమల

మరోవైపు.. వైసీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌పై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం వల్లనే ఈ ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సి వచ్చిందని చెప్పారు. ఐదేళ్లు పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై రూ.7 లక్షల మేర భారం విధించి ప్రజల రక్తాన్ని వైసీపీ పాలకులు పీల్చి లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలను, సహజ వనరులను దోచేసి రూ.19 వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.


జగన్‌ పాలనలో వ్యయం తగ్గింది..

2014-19 మధ్య GSDP 13.5% కాగా, 2019-24 మధ్య అది 10. 5 శాతానికి పడిపోయింది. 2014-19తో పోలిస్తే మూలధన వ్యయం జగన్‌ పాలనలో 60% తగ్గిందని తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణతో పోలిస్తే ఏపీకి 3.66% అధికంగా ఉండేదని అన్నారు. అలాంటిది జగన్ రెడ్డి పరిపాలన వల్ల ఏపీ కంటే తెలంగాణాకు 31.65% పెరిగిందని చెప్పారు. బడ్జెట్‌లో లేని అప్పులు, పెండింగ్‌ బిల్లులు, కార్పొరేషన్‌ ద్వారా అప్పులు వంటి విషయాలను ప్రజలకు తెలియకుండా చేసింది వైసీపీ నేతలు కాదా..? అని ప్రశ్నించారు. లక్షల కోట్లు అప్పులు చేసి ఐదేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా జగన్‌ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సైతం ఉల్లంఘించి యథేచ్ఛగా రూ.10 లక్షల కోట్లుకు పైగా అప్పులు తెచ్చారని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vundavalli Sridevi: కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసిన వ్యక్తి జగన్..

ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!

Lokesh: వారి ఆనందమే కూటమి సర్కార్‌కు వెలకట్టలేని బహుమానం

Mandakrishna: ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నీళ్లతో చెప్పా...

MLA Kanna: అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 05:33 PM