Share News

TDP: రిషికొండ భవనాలను ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తాం: నారా లోకేశ్

ABN , Publish Date - Feb 19 , 2024 | 03:09 PM

సీఎం జగన్‌ (CM Jagan)కు చిప్ పాడైందని.. రాప్తాడు ‘‘సిద్ధం’’ సభలో పట్టగలు సెల్ టార్చ్ వేయమన్నారని. ..ఒకవేళ ఆయనకు రే చీకటి ఉందేమోనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు.

TDP: రిషికొండ భవనాలను ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తాం: నారా లోకేశ్

విశాఖపట్నం: సీఎం జగన్‌ (CM Jagan)కు చిప్ పాడైందని.. రాప్తాడు ‘సిద్ధం’ సభలో పట్టపగలు సెల్ టార్చ్ వేయమన్నారని, ఒకవేళ ఆయనకు రేచీకటి ఉందేమోనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) ఆరోపించారు. సోమవారం గాజువాక నియోజకవర్గంలో జరిగిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని మండిపడ్డారు. రుషికొండకు బోడిగుండు కొట్టి.. అక్కడ భవనాలు నిర్మించడానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

2 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆ భవనాలను ప్రజా అవసరాల కోసం వాడుతామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని, వాటికి సంబంధించిన భూములను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. జగన్‌ను ఫుట్‌బాల్ ఆడే సమయం వచ్చిందని నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఒక భస్మాసురుడని, ఐరెన్ లెగ్ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నాప్ , హత్యలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.

వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారని, ఎమ్మార్వోను కూడా హత్య చేశారని ప్రస్తావించారు. రాప్తాడులో సీఎం జగన్ సభకు కవరేజ్ కోసం వచ్చిన ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై వైసీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకిల్ ప్రజల చైతన్య రథమని, గాజు గ్లాస్‌లోనే ప్రజలు టీ తాగుతారని, ఒకవేళ టీను జగన్ బంగారం గ్లాస్‌లో తాగుతారేమోనని ఎద్దేవా చేశారు.

ప్రజలను జగన్ నవ మోసాలు చేశారు

రైతులు, భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రెక్కలు విరిగిన ఫ్యాన్‌ను బయట పడవేసే సమయం వచ్చిందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ...నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. నవరత్నాలు కాదు... నవ మోసాలు చేశారని దుయ్యబట్టారు. రైతులకు కేవలం 4 గంటల ఉచిత విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ‘వై నాట్ 175 అని వైసీపీ అంటోందని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ధ్వజమెత్తారు.‘‘వై నాట్ స్టీల్ ప్లాంట్, వై నాట్ డీఎస్సీ, వై నాట్, మద్యపాన నిషేధం.. వై నాట్ జాబ్ క్యాలెండర్ అని ఎందుకు అనడం లేదు’’ అని ప్రశ్నించారు.

సైకో ఫొటోతో.. ‘‘సిద్ధం’’ ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను అధికారంలో నుంచి దించడానికి సొంత చెల్లి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సైతం ‘‘సిద్ధం’’ అంటోందన్నారు. వైసీపీ హయాంలో అన్ని వస్తువుల ధరలు పెంచారని.. అందుకే సూపర్ 6 అమలు చేస్తామని తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే అవినీతి పరుడని.. ఆయన ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎప్పుడూ మాట్లాడలేదని నిలదీశారు. వైసీపీ అక్రమాలపై జ్యూడీషియల్ విచారణ జరిపిస్తామని అన్నారు. గాజువాకలో ఉన్న టోల్ గేట్‌ను ఎత్తి వేస్తామని..కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తన మీద 22 కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ అవినీతిపై చర్చకు సిద్ధం... దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. తన రెడ్ బుక్‌పై కేసు పెట్టారని..అక్రమార్కుల పేర్లు ఇందులో ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 04:02 PM