Share News

Andhrajyothy Journalism College: జర్నలిజం మీ కలా?.. అయితే మీకిదే మా ఆహ్వానం

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:01 PM

సమాజానికి మంచి చేయాలనే తపన మీలో ఉందా? పరిస్థితులకు స్పందించే గుణముందా? తప్పును ప్రశ్నించే దమ్ము మీలో ఉందా? కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని చూస్తున్నారా? మీకోసమే ఆంధ్రజ్యోతి అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. రేపటి జర్నలిస్టులను ఆహ్వానిస్తోంది. మరెందుకు ఆలస్యం.. అవకాశాన్ని అందిపుచ్చుకోండి.. సమాజాన్ని చక్కదిద్దే జర్నలిస్ట్‌గా మారండి.

Andhrajyothy Journalism College: జర్నలిజం మీ కలా?.. అయితే మీకిదే మా ఆహ్వానం

హైదరాబాద్: సమాజానికి మంచి చేయాలనే తపన మీలో ఉందా? పరిస్థితులకు స్పందించే గుణముందా? తప్పును ప్రశ్నించే దమ్ము మీలో ఉందా? కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని చూస్తున్నారా? మీకోసమే ఆంధ్రజ్యోతి అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. రేపటి జర్నలిస్టులను ఆహ్వానిస్తోంది. మరెందుకు ఆలస్యం.. అవకాశాన్ని అందిపుచ్చుకోండి.. సమాజాన్ని చక్కదిద్దే జర్నలిస్ట్‌గా మారండి. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజీలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరాలంటే ఏం కావాలి? ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అర్హతలు:

  • ఇంగ్లీషు భాషలో వ్యవహారజ్ఞానం, తెలుగులోకి అనువాదం చేయగల నేర్పు

  • వర్తమాన విషయాలపై అవగాహన, విశ్లేషణ సామర్థ్యం

  • సరళమైన తెలుగులో రాయగలగడం

  • చక్కటి భావవ్యక్తీకరణ

  • డిగ్రీ ఉత్తీర్ణత

  • 35 సంవత్సరాలకు మించని వయసు


దరఖాస్తు విధానం:

  • మీలో పై అర్హతలన్నీ ఉంటే పూర్తి పేరు, వయసు, విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, ఉద్యోగానుభవం, ఆసక్తులు వగైరా వివరాలన్నిటితో దరఖాస్తు చేయాలి.

  • దరఖాస్తుకు సర్టిఫికెట్ల జిరాక్స్‌ ప్రతులు, ఇటీవల తీసుకున్న రెండు ఫొటోలు జతపరచాలి.

  • దరఖాస్తులోను, కవరుపైన మీ పూర్తి చిరునామా, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌, పరీక్ష రాయదలచుకున్న కేంద్రం స్పష్టంగా రాయాలి.

  • రాతపరీక్ష, ఇంటర్వ్యూ వివరాలు ఫోన్‌ ద్వారా మాత్రమే తెలియపరుస్తాం. అందువల్ల మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే మొబైల్‌ నెంబర్‌నే దరఖాస్తులో ఇవ్వాలి.

  • సోషల్ మీడియా మితిమీరి వ్యవహరిస్తోందా? - ఈ అంశంపై సొంతంగా రాసిన వ్యాసాన్ని దరఖాస్తుకు తప్పనిసరిగా జతచేయాలి. వ్యాసం లేని దరఖాస్తులను పరిశీలించం.

ఎంపిక:

  • అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

  • రాతపరీక్షలో వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.

  • అభ్యర్థుల ఎంపికలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానిదే తుది నిర్ణయం.

  • శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడేళ్లు పని చేస్తామని హామీపత్రం ఇవ్వాలి.


శిక్షణ:

  • ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో కనీసం ఆరునెలల శిక్షణ ఉంటుంది.

  • భాష, భావవ్యక్తీకరణ, వర్తమాన వ్యవహారాలపై అవగాహన, అనువాదం, ఎడిటింగ్‌లలో శిక్షణ ఉంటుంది.

  • శిక్షణ ముగించుకున్నాక ట్రైనీ ఉద్యోగులుగా అవకాశం లభిస్తుంది. వారు ఆంధ్రజ్యోతి యూనిట్లలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

వేతనం:

  • శిక్షణ కాలంలో నెలకు రూ.12,000

  • శిక్షణ అనంతరం ముఖ్య విభాగాల్లో పని చేయడానికి అర్హులైన వారికి పనితీరును బట్టి రూ.18,000 నుంచి 20,000.

  • జిల్లా విభాగాల్లో పని చేయడానికి ఎంపికైన వారికి రూ. 16,000 నుంచి రూ.18,000


పరీక్షా కేంద్రాలు..

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి

దరఖాస్తులు చేరాల్సిన ఆఖరి తేదీ: 2024, ఆగస్టు 1

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

ప్రిన్సిపాల్‌, ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్‌, ప్లాట్‌ నెం. 76, జూబ్లీహిల్స్‌, రోడ్డు నం. 70, హైదరాబాద్‌ - 500 110


null

Updated Date - Jul 27 , 2024 | 06:15 PM