Share News

Loksabha Polls: రిజర్వేషన్‌ తొలగించే యత్నం, మోదీపై రాహుల్ ఫైర్

ABN , Publish Date - May 02 , 2024 | 01:34 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లు తొలగించాలని నరేంద్ర మోదీ కుట్రకు తెరలేపారని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Loksabha Polls: రిజర్వేషన్‌ తొలగించే యత్నం, మోదీపై రాహుల్ ఫైర్
Rahul Gandhi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లు తొలగించాలని నరేంద్ర మోదీ కుట్రకు తెరలేపారని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తున్నారు. దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతుల నుంచి రిజర్వేషన్లు లాక్కొనేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రైవేటైజేషన్ పేరుతో బడుగుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది అని’ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.


‘2013లో 14 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి. 2023కు వచ్చే సరికి ఆ ఉద్యోగాల సంఖ్య 8.4 లక్షలకు చేరుకున్నాయి. బీఎస్ఎన్ఎల్, సెయిల్, బీహెచ్ఈల్ తదితర కంపెనీల నుంచి దాదాపు 6 లక్షల ఉద్యోగులను తొలగించారు. అలా తొలగించిన వారంతా రిజర్వేషన్‌తో కొలువు పొందినవారే. రైల్వే వంటి సంస్ధల్లో కాంట్రాక్టుపై పని కల్పిస్తున్నారు. కొందరు ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రధాని మోదీ ఉద్దేశంలో ప్రైవేటీకరణ అనేది దేశ వనరులను దోచుకోవడం, దీంతో బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లను దొంగిలించడం. కాంగ్రెస్ పార్టీ ఇస్తోన్న గ్యారంటీలతో ప్రభుత్వ రంగాలు బలోపేతం అవుతాయి. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఉపాధి లభిస్తోంది. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


For
Election news and National News click here

Updated Date - May 02 , 2024 | 01:35 PM