Share News

KK Survey: కేకే సంచలన సర్వే.. ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే..

ABN , Publish Date - Sep 19 , 2024 | 03:22 PM

KK Survey: ఏపీలో వెల్లడైన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు. అంతేకాదు..

KK Survey: కేకే సంచలన సర్వే.. ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే..
KK Survey

KK Survey: ఏపీలో వెల్లడైన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేసింది. అంతేకాదు.. బీజేపీ పరిస్థితిపై కేకే సర్వే సంచలన విషయాలు పేర్కొంది. బీజేపీని మునిగిపోతున్న ‘టైటానిక్ షిప్’గా అభివర్ణించారు కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్.


బీజేపీ పరిస్థితిపై కేకే సంచలన కామెంట్స్ చేశారు. హర్యానాలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అన్నారు. పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో 2 ఓడిపోతుందని స్పష్టం చేశారు. హర్యానా మాత్రమే కాదు.. ఆ తరువాత జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘోర పరాజయం చవిచూస్తుందన్నారు. బీజేపీ ఒక టైటానిక్ షిప్ అని.. మునిగిపోతున్న నావలా మారిందని కేకే వ్యాఖ్యానించారు. హర్యానాలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు.


బీజేపీ ఓటమే కాంగ్రెస్‌కి సానుకూల అంశం తప్ప.. ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత లేదన్నారు. బీజేపీ కోర్ ఓటు ఎటూ పోవడం లేదని.. న్యూట్రల్ ఓట్లను మాత్రం నష్టపోతుందని కేకే వివరించారు. బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్‌కే వెళ్తోందని అంచనా వేశారు. ఎక్కువ పార్టీలు పోటీలో ఉన్నా సరే.. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కలిగే ప్రయోజనం కాంగ్రెస్‌కే దక్కుతుందని కేకే చెప్పారు.


అదే జరిగితే పరిస్థితి వేరే ఉండేది..

ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ముందుగా రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉండేదని కేకే పేర్కొన్నారు. ఆలస్యం కావడం వల్ల ఆ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండదన్నారు. రైతులు, జాట్ వర్గం బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని.. ఎన్నికలను వీరు బాగా ప్రభావితం చేయగలరని కేకే చెప్పుకొచ్చారు. 5% ఓట్లు తేడా వస్తేనే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని.. ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సంఖ్య దరిదాపుల్లో కూడా ఉండదన్నారు.


Also Read:

రైతుల పోరుబాటతో కాంగ్రెస్ వెన్నులో వణుకు..

పిల్లలను నలుగురిలో తిడితే జరిగేది ఇదే..

తిరుమల లడ్డూపై సీఎం చెప్పినవన్నీ నిజాలే...

For More National News and Telugu News..

Updated Date - Sep 19 , 2024 | 03:28 PM