Share News

Rail accident: పట్టాలు తప్పిన మరో రైలు..

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:05 AM

సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. పశ్చిమబెంగాల్‌లో గత నెలలో కాంచన్‌ జంగా ఎక్స్‌ప్రె్‌సను గూడ్స్‌ రైలు ఢీకొట్టిన ఘటనను మర్చిపోకముందే యూపీలోని గోండా జిల్లాలో రైలు పట్టాలు తప్పింది.

Rail accident: పట్టాలు తప్పిన మరో రైలు..

  • చండీగఢ్‌- దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం

  • ఒకరి మృతి.. 35 మందికి గాయాలు

గోండా, న్యూఢిల్లీ, జూలై 18: సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. పశ్చిమబెంగాల్‌లో గత నెలలో కాంచన్‌ జంగా ఎక్స్‌ప్రె్‌సను గూడ్స్‌ రైలు ఢీకొట్టిన ఘటనను మర్చిపోకముందే యూపీలోని గోండా జిల్లాలో రైలు పట్టాలు తప్పింది. గోండా-గోరఖ్‌పూర్‌ సెక్షన్‌ మోతీగంజ్‌, ఝులామీ స్టేషన్ల మధ్య గురువారం చండీగఢ్‌-దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు. 35 మందికి గాయాలయ్యాయి. ఈ రైలు బుధవారం అర్ధరాత్రి పంజాబ్‌లోని చండీగఢ్‌ నుంచి అసోంలోని దిబ్రూగఢ్‌కు బయల్దేరింది. యూపీ చేరాక.. గురువారం మధ్యాహ్నం ఝులాహీ స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం 23 బోగీలకు గాను 5 ఏసీ బోగీలు సహా 8 పట్టాలు తప్పాయి.


ప్రమాద విషయం తెలియగానే యూపీ సీఎం యోగి సహాయక చర్యలకు ఆదేశించారు. అసోం సీఎం హిమంత ఘటనపై ఆరా తీశారు. 40 మందితో కూడిన వైద్య బృందం, 15 అంబులెన్స్‌లు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలోని 13 రైళ్లను దారి మళ్లించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. తాను పెద్ద శబ్దంతో పేలుడు విన్నట్లు చండీగఢ్‌-దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు డ్రైవర్‌ తెలిపాడు.

Updated Date - Jul 19 , 2024 | 05:05 AM