Share News

రాహుల్‌ గాంధీ బ్రిటిష్‌ పౌరుడే: సుబ్రహ్మణ్య స్వామి

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:27 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ పౌరుడేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. రాహుల్‌ గాంధీ 2003లో బ్రిటీష్‌ పౌరసత్వం తీసుకున్నారని, లండన్‌లో బ్యాక్‌ఆప్స్‌ అనే కంపెనీని కూడా స్థాపించారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

రాహుల్‌ గాంధీ బ్రిటిష్‌ పౌరుడే: సుబ్రహ్మణ్య స్వామి

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ పౌరుడేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. రాహుల్‌ గాంధీ 2003లో బ్రిటీష్‌ పౌరసత్వం తీసుకున్నారని, లండన్‌లో బ్యాక్‌ఆప్స్‌ అనే కంపెనీని కూడా స్థాపించారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. రాహుల్‌ తన కంపెనీకి సంబంధించి బ్రిటీషు ప్రభుత్వానికి యాన్యువల్‌ రిటర్న్‌లను కూడా సమర్పిస్తున్నారని తెలిపారు.

అందుకు సంబంధించిన పత్రాలను బయటపెట్టారు. ఆ కంపెనీకి రాహుల్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన బ్రిటీష్‌ పౌరుడేననడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదని పేర్కొన్నారు. రాహుల్‌ పౌరసత్వానికి సంబంధించి తాను పూర్తి వివరాలు సమర్పిస్తున్నానని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.

Updated Date - Aug 12 , 2024 | 03:27 AM