Share News

PM Modi: వినాయకుడి అరెస్టు.. కర్ణాటక కాంగ్రెస్ నిర్వాకంపై మోదీ విమర్శలు

ABN , Publish Date - Sep 14 , 2024 | 09:06 PM

బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటమే కాంగ్రెస్ అతిపెద్ద లక్ష్యమని. ఇవాళ పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే గణపతిని సైతం కటకాల వెనక్కి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో చోటుచేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.

PM Modi: వినాయకుడి అరెస్టు.. కర్ణాటక కాంగ్రెస్ నిర్వాకంపై మోదీ విమర్శలు

కురుక్షేత్ర: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హర్యానా (Haryana)లో శనివారంనాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బుజ్జగింపు రాజకీయాలకే ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఇటీవల కర్ణాటకలో గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ, ఇందుకు ప్రతిగా నిరసనలు చోటుచేసుకోవడంతో ఖైదీలను వ్యాన్ ఎక్కించినట్టు వినాయకుడిని పోలీసులు వ్యానులో ఎక్కించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.


''బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటమే కాంగ్రెస్ అతిపెద్ద లక్ష్యం. ఇవాళ పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే గణపతిని సైతం కటకాల వెనక్కి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో చోటుచేసుకుంది'' అని మోదీ అన్నారు. యావద్దేశం గణేష్ ఉత్సావాలు జరుపుకొంటుంటే కాంగ్రెస్ దానికి ఆటంకాలు సృష్టిస్తోందని, ఇవాల్టి కాంగ్రెస్ ఒకప్పటి పాత కాంగ్రెస్ కాదని, అర్బన్ నక్సల్ రూపంలోకి మారుతోందని ఆరోపించారు. అబద్ధాలు ఆడడానికి కూడా సిగ్గుపడటం లేదన్నారు.

PM Modi: హ్యాట్రిక్ విక్టరీతో ఆశీర్వదించండి


నాగమంగళం ఘటన ఏమిటంటే..

కర్ణాటకలోని మాండ్య జిల్లా నాగమంగళం పట్టణంలో ఇటీవల గణపతి నిమజ్జనం కోసం బదరికొప్పలు గ్రామానికి చెందిన కొందరు వెళ్తుండగా ఒక మసీదుకు చేరువలో కొందరు రాళ్లు విసిరారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నిరసనకారులు తమ వెంట తీసుకెళ్లారు. తొలుత ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వారి చేతుల్లో ఉన్న విగ్రహాన్ని పోలీసులు అత్సుత్సాహం చూపించి వ్యాన్ ఎక్కించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక సర్కార్‌పై నిరసనలు వ్యక్తమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గణేష్ నిమజ్జనోత్సవంలో హింసను ఖండిస్తూ, ఇది కొందరు దుండగుల పనేనని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. హోం మంత్రి జి.పరమేశ్వరన్‌ సైతం ఈ ఘటన అప్పటికప్పుడు చెలరేగిన ఘర్షణే కానీ, మతఘర్షణ కాదన్నారు.


Read MoreNational News and Latest Telugu News

Rain Alert: 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక

Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..

Updated Date - Sep 14 , 2024 | 09:36 PM