Share News

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అస్సలు మిస్ అవ్వకండి..!

ABN , Publish Date - Aug 08 , 2024 | 05:38 PM

IRCTC Keral Tour Package 2024: వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో రమణీయంగా ఉంటుంది. అందుకే.. ఈ సీజన్‌లో చాలా మంది టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా దేవ భూమి కేరళ ఈ సీజన్‌లో చాలా అందంగా ఉంటుంది. అందుకే..

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అస్సలు మిస్ అవ్వకండి..!
IRCTC Kerala Tour Package

IRCTC Keral Tour Package 2024: వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో రమణీయంగా ఉంటుంది. అందుకే.. ఈ సీజన్‌లో చాలా మంది టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా దేవ భూమి కేరళ ఈ సీజన్‌లో చాలా అందంగా ఉంటుంది. అందుకే.. దాదాపు టూరిస్టులు కేరళకు వెళ్లేందుకు ప్రయారిటీ ఇస్తారు. అయితే, టూరిస్టులను దృష్టిలో ఉంచుకుని.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ కింద కేరళలోని మున్నార్, తేక్కడి, కన్యాకుమారి, త్రివేండ్రం వంటి అందమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.


భారతదేశంలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్న రాష్ట్రాల్లో కేరళ టాప్ లిస్ట్‌లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రాష్ట్రానికి పర్యాటకుల తాకిడీ ఎక్కువగా ఉంటుంది. దేశం నుంచే కాదు.. ప్రపంచ నలు మూలల నుంచి పర్యాటకులు కేరళకు వస్తుంటారు. ఇక్కడి బీచ్‌లు, నదులు, అడవి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలోనే IRCTC కేరళ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ ధరలోనే ఎక్కువ ప్రాంతాలను విజిట్ చేయడంతో పాటు.. మంచి సౌకర్యాలను కూడా పొందవచ్చు.


ఎసెన్స్ ఆఫ్ కేరళ పేరుతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కోడ్ SEH046. 7 రాత్రులు, 8 రోజుల ఈ టూర్ ప్యాకేజీ కింద మున్నార్, తేక్కడి, కన్యాకుమారి, త్రివేండ్రంలో పర్యటించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ టూర్ ఆగస్టు 13వ తేదీన కొచ్చి నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ ప్యాకేజీ కింద ప్రయాణించే వారు ఏ అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆహారం, వసతి సహా అన్ని సౌకర్యాలను ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేస్తుంది. ప్యాకేజీలో బీమా సౌకర్యం కూడా ఉంటుంది.


ఇక ఛార్జీల విషయానికి వస్తే.. ఈ టూర్ ప్యాకేజీలో ఒక్కరికి రూ. 73,690 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇద్దరు ప్రయాణికులైతే.. ఒక్కొక్కరికి రూ. 38,320 చొప్పున ఛార్జీ ఉంటుంది. అంటే ఇద్దరు వ్యక్తులకు ఒకే గది, ఫెసిలిటీస్ కేటాయిస్తారు. ముగ్గురు వ్యక్తులయితే ఒక వ్యక్తికి రూ. 29,335 చొప్పున ఛార్జీ ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. టూర్‌ ప్యాకేజీని వెంటనే బుక్ చేసుకోండి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


Also Read:

రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై నిషేధం వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఐవోఏ

అలా ప్రచారం చేయొద్దు.. శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

ఈ హోమ్ లోన్స్ తీసుకునే వారికి షాకిచ్చిన ఆర్బీఐ!

For More National News and Telugu News..

Updated Date - Aug 08 , 2024 | 05:47 PM