Share News

Priyanka Gandhi : కాంగ్రెస్‌ హిందూ వ్యతిరే క పార్టీ కాదు

ABN , Publish Date - May 19 , 2024 | 04:13 AM

కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక పార్టీ కానేకాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ నోట వెలువడిన చిట్టచివరి పదాలు ‘హే రామ్‌’.. కాంగ్రెస్‌ పార్టీ హిందుత్వ మూలాలకు నిదర్శనమని తేల్చిచెప్పారు.

Priyanka Gandhi : కాంగ్రెస్‌ హిందూ వ్యతిరే క పార్టీ కాదు

న్యూఢిల్లీ, మే 18: కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక పార్టీ కానేకాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ నోట వెలువడిన చిట్టచివరి పదాలు ‘హే రామ్‌’.. కాంగ్రెస్‌ పార్టీ హిందుత్వ మూలాలకు నిదర్శనమని తేల్చిచెప్పారు.

శనివారం ఇండియా టుడే టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ‘బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాపై హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర వేశారు. మా పార్టీకి అతిపెద్ద నేత ఎవరు?

మహాత్మాగాంధీ. మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చినప్పుడు ఉచ్ఛరించిన చివరి పదాలు హే రామ్‌.. మరి మేం హిందూ వ్యతిరేక పార్టీ ఎలాగవుతాం? కానేకాదు’ అని ప్రియాంక పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ప్రచారంపై దృష్టి పెట్టేందుకే తాను ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రియాంక తెలిపారు. రాహుల్‌గాంధీ, తాను ఇరువురూ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీకే మేలు జరుగుతుందన్నారు.


భవిష్యత్తులోనైనా ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా, ‘నేను పోటీ చేయాలని పార్టీలోనివారు భావిస్తే.. అప్పుడు పోటీ చేస్తా’ అని చెప్పారు. కాగా, యూపీలోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌గాంధీ ఈ నియోజకవర్గాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయ్‌బరేలీ మరోసారి ఈ దేశానికి ప్రగతి దారి చూపాలని వ్యాఖ్యానించారు.

రాహుల్‌ ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. దేశం గుండె చప్పుడు ఆయనకు తెలుసు. అందుకే మంచి ప్రధాని అవుతారు. అయితే, ఎన్నికలు ముగిశాక ఇండియా కూటమి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

- ప్రియాంక

Updated Date - May 19 , 2024 | 04:13 AM