Share News

Lok sabha Election 2024: అమేథీ నుంచి కాదు రాహుల్‌గాంధీ.. పోటీ చేసే స్థానంపై ట్విస్ట్

ABN , Publish Date - May 03 , 2024 | 07:01 AM

కాంగ్రెస్(congress) పార్టీ అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(rae bareli) లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల నామినేషన్ గడువు మే 3వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను నేడు ప్రకటించనుంది.

Lok sabha Election 2024: అమేథీ నుంచి కాదు రాహుల్‌గాంధీ.. పోటీ చేసే స్థానంపై ట్విస్ట్
Rahul Gandhi is not from Amethi from rae bareli to contest

కాంగ్రెస్(congress) పార్టీ అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(rae bareli) లోక్‌సభ(lok sabha election 2024) స్థానాల నుంచి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల నామినేషన్ గడువు మే 3వ తేదీతో ముగియనుంది. గురువారం నాటికి రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తుందని భావించినా అది కుదరలేదు. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను నేడు ప్రకటించనుంది.

నివేదికల ప్రకారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాయ్ బరేలీ నుంచి, అమేథీ నుంచి కేఎల్ శర్మ(KL Sharma )ను పోటీకి దింపుతుందని తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఈరోజు వెలువడనుంది. నేడు నామినేషన్ దాఖలు చేసే సమయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు నామినేషన్‌ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో ఈ రెండు ప్రతిష్టాత్మక నియోజకవర్గాల అభ్యర్థులను గురువారం రాత్రిలోగా పార్టీ ప్రకటించాలని భావించారు. ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ని ప్రశ్నించగా అమేథీ, రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్‌(congress) అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ మే 3 కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని రెండు స్థానాలకు సంబంధించి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు పార్టీ సన్నాహాలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


మరోవైపు అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఇప్పటికే తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. రాహుల్ గాంధీని అమేథీ నుంచి, ప్రియాంక గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయించాలని ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రస్తుతం ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులు అనేక దశాబ్దాలుగా ఈ స్థానాలకు ప్రాతినిధ్యం వహించినందున అమేథీ, రాయ్‌బరేలీ వీరికి కంచుకోటగా మారాయి.

రాయ్‌బరేలీ నియోజకవర్గానికి సోనియా గాంధీ 2004 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అమేథీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1999లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి 'ఇండియా'లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (SP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. దీంతో యూపీలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది.


ఇది కూడా చదవండి:

IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్‌ ప్రయాణం


Heatwave: హీట్‌వేవ్ ఎఫెక్ట్..పెరుగుతున్న కూరగాయల ధరలు, ద్రవ్యోల్బణంపై కూడా

Read Latest National News and Telugu News

Updated Date - May 03 , 2024 | 07:06 AM