Share News

మోదీ జీ.. తెలంగాణలో కులగణన మొదలైంది

ABN , Publish Date - Nov 10 , 2024 | 04:09 AM

‘‘మోదీ జీ తెలంగాణలో శనివారం కులగణన మొదలైంది. కులగణన లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి విధానాలను రూపొందిస్తాం.

మోదీ జీ.. తెలంగాణలో కులగణన మొదలైంది

త్వరలో మహారాష్ట్రలోనూ

దేశవ్యాప్తంగా కులగణనను మీరు ఆపలేరు: రాహుల్‌

న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘మోదీ జీ తెలంగాణలో శనివారం కులగణన మొదలైంది. కులగణన లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి విధానాలను రూపొందిస్తాం. త్వరలో మహారాష్ట్రలోనూ ఇదే జరగనుంది. దేశంలో సమగ్ర కులగణన చేపట్టడం బీజేపీకి ఇష్టంలేదన్న సంగతి అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా కుల గణనను మీరు ఆపలేరు. ఈ పార్లమెంట్‌లోనే కులగణనను ఆమోదింపజేసేలా చేసి రిజర్వేషన్లపై 50శాతం గోడను బద్దలు కొడతాం’’ అని రాహుల్‌ గాంధీ శనివారం ‘ఎక్స్‌’లో స్పష్టంచేశారు. మరోవైపు శనివారం ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌, జంషెడ్‌పూర్‌లలో ఎన్నికల ర్యాలీల్లో రాహుల్‌ మాట్లాడుతూ, దేశంలో ఓ సామాన్యుడు ఎంతైతే పన్ను చెల్లిస్తున్నాడో అదానీ కూడా అంతే పన్ను కడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వ పన్నుల విధానం పేదవారిని దోపిడీ చేసేలా ఉందని ఆయన విమర్శించారు.

Updated Date - Nov 10 , 2024 | 04:10 AM