Share News

BJP vs Congress: పిల్ల చేష్టలు తగ్గించుకో.. రాహుల్‌పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:14 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఒక్కరూ కూడా లేరంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు.

BJP vs Congress: పిల్ల చేష్టలు తగ్గించుకో..  రాహుల్‌పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..
Rahul and Kiren Rijiju

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఒక్కరూ కూడా లేరంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా ఆయన పేర్కొన్నారు. చిన్నపిల్లల వ్యవహార శైలి వినోదాన్ని పంచవచ్చని.. అయితే అది విభజన తీసుకొచ్చే ఎత్తుగడలతో వెనుకబడిన వర్గాలను కించపరిచే విధంగా ఉండకూడదన్నారు. రాహుల్ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీల్లో, సినిమాలు, క్రీడల్లోనూ రిజర్వేషన్లు కోరుతున్నారు. ఇలా ఆలోచించడం పిల్లల మనస్తత్వం మాత్రమే కాదు.. రాహుల్ గాంధీని ప్రోత్సహించే వ్యక్తులు ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజనురాలైన మొదటి రాష్ట్రపతి అని, ప్రధానమంత్రి ఓబీసీకి చెందిన వారని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. అనేక మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు కేంద్ర మంత్రులుగా ఉన్నారని, మరిన్ని ఉన్నత పదవుల్లో ఉన్నారనే విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని హితవు పలికారు. మీ బాలక్ బుద్ధితో వెనుకబడిన వర్గాల ప్రజలను హేళన చేయవద్దని కేంద్రమంత్రి రాహుల్ గాంధీకి సూచించారు.

PM Modi: మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం


రాహుల్‌ టార్గెట్‌గా..

ప్రభుత్వాలు మిస్ ఇండియాని ఎంపిక చేయవనే విషయాన్ని రాహుల్ గాంధీ ముందుగా తెలుసుకోవాలని కిరణ్ రిజిజు సూచించారు. సినిమాల్లో నటీనటుల్ని, ఒలింపిక్స్‌కి క్రీడాకారుల్ని ప్రభుత్వాలు ఎంపిక చేయవన్నారు. ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లను మార్చడానికి సుప్రీంకోర్టు అంగీకరించదనే విషయాన్ని రాహుల్ గాంధీనే స్పష్టం చేశారన్నారు. కులగణన డిమాండ్‌తో రాహుల్ గాంధీ దేశాన్ని విభజించేందుకు డిమాండ్ చేస్తున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు.

Premalatha: విజయ్‌ అనేక సవాళ్లను అధిగమించాలి..


రాహుల్ ఏమన్నారంటే..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కార్యక్రమంలో దేశంలో కులగణన గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన వారు లేరన్నారు. దేశంలోని మీడియా డ్యాన్స్, మ్యూజిక్, క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతుందని, రైతులు, కార్మికుల గురించి పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కులగణన కేవలం జనాభా లెక్క కాదని.. ఇది సమర్థవంతమైన విధానాల రూపకల్పనకు పునాది వంటిదన్నారు. మిస్ ఇండియా విన్నర్స్‌లో ఎవరైనా దళితులున్నారా అంటూ రాహుల్ ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గానికి చెందిన వాళ్లను మిస్ ఇండియా పోటీలకు దూరం పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వర్గాలకు చెందిన 90 శాతం మంది వివక్ష ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మీడియాలో పెద్ద యాంకర్లుగా చెలామణీ అవుతున్న మహిళల్లో ఎవరైనా దళితులు ఉన్నారా అని రాహుల్ ప్రశ్నించగా.. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.


Tamilisai: ఆధ్యాత్మికం లేకుండా రాజకీయం లేదు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 04:14 PM