Share News

Mohan Bhagwat: మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారు

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:32 AM

మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు.

Mohan Bhagwat: మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారు

  • ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

పుణె, సెప్టెంబరు 6: మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. శంకర్‌ దినకర్‌ కానే(భయ్యాజీ)1971లో మణిపూర్‌లో చేసిన సేవలను స్మరించుకుంటూ పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేవుళ్లమని మనమే ప్రకటించుకోకూడదని అన్నారు. కొందరు మెరుపులా ప్రకాశించాలని అనుకొంటారని, కాని అది నేలను తాకిన తర్వాత అక్కడ మునుపటి కంటే చీకటిగా మారుతుందని పేర్కొన్నారు.


పనిమంతులు దీపంలా ఉండాలని, అవసరమైనప్పుడు వెలుగును పంచాలని సూచించారు. శంకర్‌ దినకర్‌ 1971 వరకు మణిపూర్‌లో బాలల విద్య కోసం పనిచేశారు. మణిపూర్‌ విద్యార్థులను మహారాష్ట్ర తీసుకువచ్చి వారి చదువుకు తోడ్పడ్డారు. ప్రస్తుతం మణిపూర్‌లో ఘర్షణలతో నెలకొన్న పరిస్థితులు అత్యంత సవాలుగా మారాయని భగవత్‌ వివరించారు. అక్కడ నెలకొన్న ఘర్షణల్లో 200 మంది మరణించగా, 60,000 మంది నిరాశ్రయులుగా మారారు. ఇంతటి కఠిన పరిస్థితుల్లో కూడా ఆర్‌ఎ్‌సఎస్‌ వలంటీర్లు అక్కడే ఉండి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

Updated Date - Sep 07 , 2024 | 05:32 AM