Share News

Supreme Court: ముస్లిం మహిళలకు ఊరట.. భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:34 PM

పెళ్లై విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు(Muslim women) ఊరట లభించింది. ఇకపై ముస్లిం మహిళలు కూడా విడాకుల తర్వాత భరణం పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది.

Supreme Court: ముస్లిం మహిళలకు ఊరట.. భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court says Muslim women

పెళ్లై విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు(Muslim women) ఊరట లభించింది. ఇకపై ముస్లిం మహిళలు కూడా విడాకుల తర్వాత భరణం పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు వారి భర్తలపై సెక్షన్ 125 CrPC కింద భరణం కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో వేర్వేరుగా ఒకేవిధమైన తీర్పులను వెలువరించింది. ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం 1986 సెక్యులర్ చట్టాన్ని అతిక్రమించదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.


మహిళలందరికీ

ఒక భారతీయ వివాహిత మహిళ(indian women) ఆర్థికంగా స్వతంత్రంగా లేదన్న వాస్తవాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. మా నిర్ణయంలో 2019 చట్టం ప్రకారం ‘చట్టవిరుద్ధమైన విడాకుల’ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. CrPC సెక్షన్ 125 ప్రకారం పెళ్లైన మహిళలకు మాత్రమే కాకుండా మహిళలందరికీ (లివ్-ఇన్ మహిళలతో సహా) వర్తిస్తుందని వెల్లడించింది. భరణం కోరే విషయంలో మతంతో సంబంధం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 125 CrPC కింద కేసు పెండింగ్‌లో ఉండి, ఒక ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే, ఆమె 2019 చట్టాన్ని ఆశ్రయించవచ్చని కోర్టు చెప్పింది.


పిటిషన్‌ తిరస్కరణ

సీఆర్‌పీసీలోని సెక్షన్ 125 కింద విడాకులు తీసుకున్న తన భార్యకు అనుకూలంగా మధ్యంతర భరణం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ముస్లిం వ్యక్తి చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డబుల్ బెంచ్ కొట్టివేసింది. ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం, 1986 సెక్షన్ 125 CrPC నిబంధనలను రద్దు చేయదని కోర్టు స్పష్టం చేసింది. ఒక ముస్లిం మహిళ ఆఘా(Muslim women) తన భర్త నుంచి భరణం కావాలని డిమాండ్ చేస్తూ CrPC సెక్షన్ 125 కింద పిటిషన్ దాఖలు చేసింది. ప్రతినెలా మధ్యంతర భరణం రూ. 20 వేలు చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని పిటిషనర్ తరపున కోర్టుకు విన్నవించారు.


ఇది కూడా చదవండి:

Fake Products: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రొడక్ట్ నకిలీదా లేక నిజమైనదో ఇలా గుర్తించండి

Weather Update: జులై 13 వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

National : నకిలీ కంపెనీలు.. బలవంతపు చాకిరీ!


Bhuvaneshwar : పూరీ ‘రత్న భండార్‌’ను 14న తెరవాలి

For Latest News and National News click here

Updated Date - Jul 10 , 2024 | 12:38 PM