Share News

Congress: బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా.. కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు..!?

ABN , Publish Date - Jul 13 , 2024 | 02:12 PM

బీఆర్ఎస్ పార్టీని చేరికలు కుదిపేస్తున్నాయి..! ఎంతలా అంటే.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు మొదలైన జంపింగ్‌లు.. కొనసాగూతనే ఉన్నాయి. దీంతో ఇవాళ బీఆర్ఎస్‌లో సిట్టింగ్‌లు, కీలక నేతలు రేపు ఏ పార్టీలో తెలియని పరిస్థితిలో కారు పార్టీ అధినేతలు ఉన్నారు..!

Congress: బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా.. కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు..!?

బీఆర్ఎస్ (BRS) పార్టీని చేరికలు కుదిపేస్తున్నాయి..! ఎంతలా అంటే.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి (Congress) మొదలైన జంపింగ్‌లు.. కొనసాగూతూనే ఉన్నాయి. దీంతో ఇవాళ బీఆర్ఎస్‌లో ఉన్న సిట్టింగ్‌లు, కీలక నేతలు రేపు ఏ పార్టీలో చేరిపోతారో తెలియని పరిస్థితిలో హైకమాండ్ ఉంది..! ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో ‘కారు’ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆఖరికి ఆ నలుగురే గులాబీ పార్టీలో మిగులుతారనే చర్చలు గట్టిగానే నడుస్తున్నాయి.


ఏం జరుగుతోంది..?

జులై నెలాఖరులోగా కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ఎల్పీ విలీనమే టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారనే టాక్ రాష్ట్ర రాజకీయాల్లో గట్టిగా నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. ఇక కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపుతో 38కి బీఆర్ఎస్ బలం తగ్గిపోయింది. ఇక ఇప్పటి వరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 73కు చేరుకుంది. అయితే.. మరో 20 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు క్యూలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

గ్రేటర్‌లో ఖాళీ!

మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే బీఆర్ఎస్ఎల్పీ విలీనం పూర్తి అవుతుంది. శుక్రవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఇవాళ అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. ఇక మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సహా పలువురు గ్రేటర్ హైదరాబాద్‌ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Updated Date - Jul 13 , 2024 | 02:15 PM