Share News

Tourist Places: హైదరాబాద్‌కి సమీపంలోని అందమైన పర్యాటక ప్రదేశాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:31 PM

ప్రస్తుత బిజీ ప్రపంచంలో తమకోసం కొంత సమయం గడపాలని ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది. అందమైన ప్రదేశాలకు వెళ్లి, కాసేపు ప్రశాంతంగా గడపాలని కోరుకుంటుంటారు. బాధ్యతలు, ఒత్తిళ్ల..

Tourist Places: హైదరాబాద్‌కి సమీపంలోని అందమైన పర్యాటక ప్రదేశాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
Beautiful Tourist Spots

ప్రస్తుత బిజీ ప్రపంచంలో తమకోసం కొంత సమయం గడపాలని ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది. అందమైన ప్రదేశాలకు (Beautiful Places) వెళ్లి, కాసేపు ప్రశాంతంగా గడపాలని కోరుకుంటుంటారు. బాధ్యతలు, ఒత్తిళ్ల నుంచి కాస్త ఉపశమనం పొందాలని భావిస్తుంటారు. అయితే.. సుదూర ప్రాంతాలకు వెళ్లలేక కొందరు సతమతమవుతుంటారు. సమయం దొరక్క, డబ్బులు సరిపోక.. తమ ట్రిప్పులను రద్దు చేసుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. ఎక్కువ ఖర్చులు వెచ్చించాల్సిన అవసరం లేకుండా.. హైదరాబాద్ సమీపంలోనే సందర్శించాల్సిన కొన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటంటే..


1. అనంతగిరి హిల్స్ (Ananthagiri Hills): హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ‘తెలంగాణ ఊటీ’గా పిలుస్తుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకుల్ని ఇట్టే కట్టి పడేస్తాయి. ఇక్కడున్న జలపాతాలు, సరస్సులు.. ఎంతో మనోహరంగా అనిపిస్తాయి. పెద్ద పెద్ద చెట్ల నడుమ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ.. ఇక్కడ ప్రశాంతంగా గడపొచ్చు.

Ananthagiri-Hills.jpg

2. పోచారం అభయారణ్యం (Pocharam Wildlife Sanctuary): ఇక్కడ చిలుకల నుంచి గ్రద్దల దాకా.. 200కి పైగా పక్షి జాతులు ఉంటాయి. పక్షులకు స్వర్గధామమైన ఈ ప్రదేశంలో.. పర్యాటకల్ని మైమరిపించే ప్రకృతి అందాలు ఉంటాయి. ఇక్కడ జింకలు, నక్కలతో పాటు మరెన్నో వన్యప్రాణులు ఉంటాయి. ఈ పోచారం.. వండర్స్‌కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు.

Pocharam-Wildlife.jpg

3. బెలూమ్ గుహలు (Belum Caves): ఇవి మన భారతదేశంలోని రెండో అతిపెద్ద సహజ గుహలు. ఇక్కడ గుహ నిర్మాణాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ గుహలు.. భూమి ఉపరితలం కిందున్న అద్భుతాలను అన్వేషించడానికి ఓ ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయి. సాహసయాత్రలు చేసే పర్యాటకులు ఇక్కడికి తప్పకుండా వెళ్లి తీరాల్సిందే.

Belum-Caves.jpg

4. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar): చరిత్ర, ప్రకృతి.. ఈ రెండింటికీ నాగార్జున సాగర్ అద్దం పడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి డ్యామ్‌లలో ఇదొకటి. ఈ చారిత్రాత్మక పట్టణం.. సాంస్కృతిక వారసత్వం, ఇంజనీరింగ్ అద్భుతాల సమ్మేళనాన్ని అందిస్తుంది. పురాతన బౌద్ధ ప్రదేశాలు, కళాఖండాలను ఇక్కడి మ్యూజియంలో అన్వేషించవచ్చు.

Nagarjuna-Sagar.jpg

5. హార్సిలీ హిల్స్ (Horsley Hills): దీనిని ‘ఆంధ్రా ఊటీ’ అని పిలుస్తారు. ఈ మనోహరమైన హిల్ స్టేషన్‌లో.. మైమరిపించే అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అనేక సాహస కార్యకలాపాలు ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలు మిమ్మల్ని మైమరిపిస్తాయి. ఈ హార్సిలీ హిల్స్ మిమ్మల్ని రీఫ్రెష్ చేసి, సరికొత్త అనుభవాలను అందిస్తుంది.

Horsley-Hills.jpg

Updated Date - Jul 08 , 2024 | 04:44 PM