Share News

Viral Video: సింహాల మధ్యలోకి రాయల్‌‌‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN , Publish Date - Jun 05 , 2024 | 09:53 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొందరు జంతువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు..

Viral Video: సింహాల మధ్యలోకి రాయల్‌‌‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొందరు జంతువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు వాటితో ప్రమాదకర ఆటలు ఆడుకుంటుంటారు. తాజాగా, ఓ వ్యక్తి సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై రెండు సింహాలు పడుకుని ఉన్నాయి. ఓ వ్యక్తి వాటి మధ్యలోకి దూసుకొచ్చాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆఫ్రికాలోని (Africa) జాతీయ ఉద్యానవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతువులను చూసేందుకు చాలా మంది పర్యాటకులు వాహనాల్లో అడవిలోకి పర్యటిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకంది. దారి మధ్యలో కొన్ని సింహాలు పడుకుని ఉండడంతో వాహనాలన్నీ దూరంగా నిలిపేశారు. పర్యాటకులంతా దూరం నుంచి వాటిని గమనిస్తున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఈమేంటీ భర్తతో కలిసి మరీ ఇలా చేసిందీ.. చెత్త కుండీల వద్దకు కుక్క పిల్లలను తీసుకొచ్చి..


ఓ వ్యక్తి బైకుపై (Biker) సింహాలు ఉన్న ప్రాంతం వైపు వచ్చాడు. అయితే అన్ని వాహనాలు అక్కడ ఆగి ఉన్నా కూడా అతను మాత్రం ఏమాత్రం ఆగలేదు. సింహాలు పడుకుని ఉండడం చూసి కూడా అతను ఏమాత్రం భయపడకుండా వాటి మధ్యలో నుంచే దూసుకెళ్లాడు. బైకు సమీపానికి రావడం చూసిన సింహం.. మళ్లీ తల నేలపై పెట్టి పడుకుంది. అప్పటికే ఆహారం తిని రెస్ట్‌లో ఉందో ఏమో గానీ.. ఆ వ్యక్తిని చూసినా కూడా సైలెంట్‌గా ఉండిపోయింది. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్నా వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: కూర్చుని కూడా భయపెడుతున్న అమ్మాయి.. ఇంతకీ ఈమె చేసిన పని చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడు సామాన్యుడు కాదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాహసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమేంటీ.. చూసేందుకు సున్నితంగా ఉన్నా.. ఎదురుగా చికెన్ పెట్టగానే..

Updated Date - Jun 05 , 2024 | 11:02 PM