Share News

Viral Video: నిద్రపోతున్న వ్యక్తి చొక్కాలోకి దూరిన పాము.. ఏమైందా అని చూడగా చివరకు షాకింగ్ సీన్..

ABN , Publish Date - Jun 02 , 2024 | 08:42 PM

ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ విష సర్పాలు కనిపించడం తరచూ చూస్తుంటాం. కొన్నిసార్లు ఏకంగా ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, మంచాల కింద నంచి పాములు బయటికి రావడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ..

Viral Video: నిద్రపోతున్న వ్యక్తి చొక్కాలోకి దూరిన పాము.. ఏమైందా అని చూడగా చివరకు షాకింగ్ సీన్..

ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ విష సర్పాలు కనిపించడం తరచూ చూస్తుంటాం. కొన్నిసార్లు ఏకంగా ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, మంచాల కింద నంచి పాములు బయటికి రావడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు మరింత ఆశ్చర్యానికి గురి చేసే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చెట్టు పక్కన నిద్రపోతుండగా.. ఓ పాము అతడి చొక్కాలోకి దూరింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చెట్టుకు ఆనుకుని కూర్చుని నిద్రపోతున్నాడు. ఇంతవరకూ బాగానే ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపటికి అటుగా వచ్చిన ఓ పొడవాటి పాము.. నేరుగా (snake entered into man shirt) అతడి చొక్కాలోకి దూరింది. అయితే అతను నిద్రపోతుండడంతో దాన్ని పట్టించుకోలేదు. చొక్కాలోకి దూరిన పాము.. చివరకు లోపలే చుట్ట చుట్టుకుని పడుకుంది.

Viral Video: సింహంతో కలిసి చికెన్ షేరింగ్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..


అయితే అటుగా వెళ్తున్న వారికి అనుమానం వచ్చి అతడి వద్దకు వెళ్లి పరిశీలించారు. చొక్కాలో ఏదో పాకుతున్నట్లు చూసి అతన్ని నిద్రలేపారు. చివరకు చొక్కాలో పాము ఉన్నట్లు గుర్తించిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. అయితే పక్కన ఉన్న వారు మెల్లగా అతడి చొక్కా గుండీలు విప్పారు. ఈ క్రమంలో పాము అతడి చొక్కాలో నుంచి మెల్లగా బయటికి వచ్చింది. పూర్తిగా బయటికి వచ్చిన పామును చూసి అతడితో పాటూ పక్కన ఉన్న వారు కూడా షాక్ అయ్యారు.

Viral Video: కొండచిలువ ఆహారం ఎలా తింటుందో ఎప్పుడైనా చూశారా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..


అయితే అదృష్టవశాత్తు ఆ పాము ఎలాంటి హానీ చేయకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘పాము పాకుతున్నా పట్టించుకోకుండా నిద్రపోవడమేంట్రా నాయనా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని.. ఈ రెండు సింహాలు చిన్న టెక్నిక్‌తో ఎలా దాటాయో చూడండి...

Updated Date - Jun 02 , 2024 | 08:42 PM