Share News

Viral Video: ఆటో డ్రైవర్ సమాధానానికి అవాక్కైన యువతి.. ఆటో దిగుతూ ఆమె అడిగిన ప్రశ్నకు..

ABN , Publish Date - May 31 , 2024 | 06:08 PM

మహిళలకు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఆటోల్లో వెళ్లే సమయంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఆటో డ్రైవర్లు యువతులు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూశాం. అలాగే..

Viral Video: ఆటో డ్రైవర్ సమాధానానికి అవాక్కైన యువతి.. ఆటో దిగుతూ ఆమె అడిగిన ప్రశ్నకు..

మహిళలకు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఆటోల్లో వెళ్లే సమయంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఆటో డ్రైవర్లు యువతులు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూశాం. అలాగే మరికొందరు వారిని బెదిరించి నగలు, నగదును దోచుకోవడం కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. యువతి అడిగిన ప్రశ్నకు ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాధానం చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విదేశీ యువతి (Foreign young women) ఆటో ఎక్కింది. దారి మధ్యలో ఆమె డ్రైవర్‌కు (Auto driver) ఎలా వెళ్లాలో సూచనలు ఇస్తూ ఉంది. అందుకు తగ్గట్టుగా డ్రైవర్ కూడా తన వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఎదురుగా కూడలి రావడం చూసి మహిళ.. రైట్ వెళ్లమని ఇంగ్లీష్‌లో చెబతుతూ చేయి మాత్రం ఎడమ వైపు చూపిస్తుంది. వాస్తవంగా తాను ఎడమవైపు వెళ్లా్ల్సి ఉన్నా.. డ్రైవర్‌కు మాత్రం రైట్ అని పొరపాటున చెబుతుంది.

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే.. రైతు తెలివితేటలు మామూలుగా లేవుగా..


అయితే అప్పటికే ఆటో డ్రైవర్.. తన వాహనాన్ని ఎడమవైపు తిప్పుతాడు. దీంతో మహిళ ‘‘పొరపాటున రైట్ అని చెప్పినా.. నేను ఎడమవైపు వెళ్లాలనే విషయం నీకెలా తెలుసు’’.. అని వాహనం ఆగగానే డ్రైవర్‌ను అడుగుతుంది. ఇందుకు ఆటో డ్రైవర్.. ‘‘నేను ఆడవాళ్లను అర్థం చేసుకోగలను’’.. అని ఇంగ్లీష్‌లో సమాధానం చెబుతాడు. ఇందుకు సదరు మహిళ షాక్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆటో డ్రైవర్ సమాధానం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతను చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదెక్కడి తెలివిరా బాబోయ్.. కూలర్‌ను ఫ్రిడ్జ్‌గా ఎలా మార్చాడో చూడండి..

Updated Date - May 31 , 2024 | 08:27 PM