Share News

Viral Video: ఎవరూ లేని సమయంలో ఆఫీసులో యువతి నిర్వాకం.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అవాక్కయ్యే సీన్..

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:17 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువత వ్యూస్, లైకుల కోసం ఏవేవో పిచ్చి పిచ్చి పనుల చేయడం చూస్తున్నాం. కొందరు యువతులు అందరి ముందూ అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా చూస్తున్నాం. అయితే..

Viral Video: ఎవరూ లేని సమయంలో ఆఫీసులో యువతి నిర్వాకం.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అవాక్కయ్యే సీన్..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువత వ్యూస్, లైకుల కోసం ఏవేవో పిచ్చి పిచ్చి పనుల చేయడం చూస్తున్నాం. కొందరు యువతులు అందరి ముందూ అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా చూస్తున్నాం. అయితే మరికొందరు యువతులు కొన్నిసార్లు సహజంగానే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి విచిత్ర ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఆఫీసులో ఎవరూ లేని సమయం చూసి విచిత్రంగా ప్రవర్తించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఆఫీసులో విధుల్లో ఉంటుంది. అయితే ఆ సమయంలో సిబ్బంది ఎవరూ అక్కడ కనిపించరు. దీంతో ఆమె ఎంతో ఫ్రీగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఆమెకు ఎవరి నుంచో ఫోన్ వస్తుంది. బ్లూటూత్ చెవిలో పెట్టుకున్న ఆమె.. అవతలి వారి ఆదేశాలను పాటిస్తున్నట్లుగా వేగంగ ఎదురుగా ఉన్న సోఫా వద్దకు వెళ్తుంది. సోఫాలు శుభ్రం చేస్తున్న సమయంలో ఆమెలో ఉత్సాహం ఉరకలేస్తుంది. సంతోషాన్ని ఆపుకోలేక (young woman danced) ఒక్కసారిగా డాన్సులు చేస్తుంది.

Viral Video: ఎంత బ్రతిమాలుతున్నా వరుడు వినలేదని.. బంధువుల సమక్షంలోనే ఈ వధువు చేసిన పని..


డాన్స్ చేస్తూనే సోఫాలన్నీ శుభ్రం చేసేస్తుంది. అంతటిలో ఆగకుండా ఫ్లోర్ శుభ్రం చేస్తున్న సమయంలోనూ చీపుర్లను స్టైల్‌గా పట్టుకుని డాన్సులు ఇరగతదీసేస్తుంది. ఫ్లోర్ మొత్తం అటూ, ఇటూ తిరుగుతూ డాన్స్ చేస్తూనే ఉంటుంది. ఇంతలో తన బాస్ లోపలికి వస్తాడు. ఆమె డాన్స్ చేయడాన్ని చూసి అలాగే నిలబడిపోతాడు. ఆమె మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా డాన్స్ చేస్తూనే ఉంటుంది. చాలా సేపు అలా డాన్స్ చేశాక.. చివరగా ఒక్కసారిగా వెనక్కుతిరగ్గానే తన బాస్ కనిపిస్తాడు.

Viral Video: ఆటో డ్రైవర్ సమాధానానికి అవాక్కైన యువతి.. ఆటో దిగుతూ ఆమె అడిగిన ప్రశ్నకు..


తన బాస్‌ను చూడగానే వెంటనే నాలుక్కరుచుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయి తన విధుల్లో మునిగిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. మూడేళ్ల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె డాన్స్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఆడుతూ పాడుతూ పని చేయడం అంటే ఇదే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: హోటల్ గదిలోకి వెళ్లే ముందు యువతులు చేయాల్సిన పనులివే.. ఈమె ఏం చేసిందో చూస్తే..

Updated Date - Jun 01 , 2024 | 05:17 PM