Share News

Viral Video: ఈమేంటీ.. చూసేందుకు సున్నితంగా ఉన్నా.. ఎదురుగా చికెన్ పెట్టగానే..

ABN , Publish Date - Jun 05 , 2024 | 09:39 PM

కొందరు పేరుకు అమ్మాయిలే అయినా.. అబ్బాయిలకు ఏమాత్ర తగ్గరు. ఏ విషయంలో అయినా పురుషులతో సమానంగా పని చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు యువతులైతే... యువకులు కూడా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి..

Viral Video: ఈమేంటీ.. చూసేందుకు సున్నితంగా ఉన్నా.. ఎదురుగా చికెన్ పెట్టగానే..

కొందరు పేరుకు అమ్మాయిలే అయినా.. అబ్బాయిలకు ఏమాత్ర తగ్గరు. ఏ విషయంలో అయినా పురుషులతో సమానంగా పని చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు యువతులైతే... యువకులు కూడా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చూసేందుకు సున్నితంగా ఉన్న యువతి.. చికెన్ తినే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చూసేందుకు ఎంతో స్మార్ట్‌గా ఉన్న ఓ యువతి (young woman) .. హోటల్‌లో అందరికీ షాక్ ఇచ్చింది. విలాసవంతమైన రెస్టారెంట్‌కు వెళ్లిన ఆమె.. ఫుడ్ ఆర్డర్ చేసింది. కాసేపట్లోనే హోటల్ సిబ్బంది.. ఆమె ఎదురుగా ఓ పెద్ద ప్లేటులో ఫ్రై చేసిన పెద్ద చికెన్ ముక్కను (chicken piece) తీసుకుని వచ్చారు. సాధారణంగా చాలా వరకు అమ్మాయిలు.. ఫుడ్ చాలా తక్కువగా తీసుకోవడంతో పాటూ తినే విధానం కూడా అందంగా ఉంటుంది.

Viral Video: ఈమేంటీ భర్తతో కలిసి మరీ ఇలా చేసిందీ.. చెత్త కుండీల వద్దకు కుక్క పిల్లలను తీసుకొచ్చి..


కానీ ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. చికెన్ ముక్కను ఎదురుగా పెట్టాగానే.. దానిపై గ్రేవీ పోసుకుని అంత పెద్ద ముక్కను నోటితో పీక్కుంటూ తినేసింది. ఇలా అంత పెద్ద ముక్కను పంటితో బలవంతంగా కొరికి కొరికి మరీ తినడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇలా మొత్తం మొక్కును నిముషాల వ్యవధిలో హాంఫట్ చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె కుంభకర్ణురాలిగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో..! ఈమె తిండి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కూర్చుని కూడా భయపెడుతున్న అమ్మాయి.. ఇంతకీ ఈమె చేసిన పని చూస్తే..

Updated Date - Jun 05 , 2024 | 09:39 PM