Share News

Viral Video: ఇందుకే హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది.. పైనుంచి దూసుకొచ్చిన ప్రమాదం నుంచి ఇతనెలా తప్పించుకున్నాడంటే..

ABN , Publish Date - Aug 28 , 2024 | 08:35 PM

వాహనాల డ్రైవింగ్ సమయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. ప్రధానంగా బైకు నడిపేవారు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. హల్మెట్ ధరించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తున్నా పట్టించుకోరు. హెల్మెట్ లేకుండా బైకులు డ్రైవ్ చేస్తూ..

Viral Video: ఇందుకే హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది.. పైనుంచి దూసుకొచ్చిన ప్రమాదం నుంచి ఇతనెలా తప్పించుకున్నాడంటే..

వాహనాల డ్రైవింగ్ సమయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. ప్రధానంగా బైకు నడిపేవారు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. హల్మెట్ ధరించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తున్నా పట్టించుకోరు. హెల్మెట్ లేకుండా బైకులు డ్రైవ్ చేస్తూ ప్రాణాలు పొగొట్టుకున్న వారిని నిత్యం చూస్తున్నా మార్పు మాత్రం రాదు. హెల్మెట్ విలువను తెలియజేసేలా నిత్యం అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హెల్మె్ట్ ధరించిన ఓ వ్యక్తి పైనుంచి దూసుకొచ్చిన ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకులో వెళ్తున్న ఓ వ్యక్తికి (man riding bike) షాకింగ్ అనుభవం ఎదురైంది. అయితే హెల్మెట్ (Helmet) ఉండడంతో పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఓ వ్యక్తి బైకులో వెళ్తుండగా.. మార్గ మధ్యలో ఉన్నట్టుండి వర్షంతో పాటూ భారీ ఈదురుగాలులు వీస్తాయి. ఓ కాలనీ గుండా వెళ్తుండగా గాలుల బీభత్సానికి పక్కనే ఉన్న రేకులు ఊగిపోతుంటాయి.

Viral Video: అరే.. పెద్ద కష్టమే వచ్చిందే.. చీర ధరించిన మహిళలు.. ఎస్కలేటర్‌ ఎక్కడంతో.. చివరకు..


ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ పెద్ద రేకు కొట్టుకొచ్చి సదరు వ్యక్తిపై పడుతుంది. అయితే తలపై హెల్మెట్ ఉండడంతో అతడికి ఏమీ కాదు. లేదంటే తలకు పెద్ద గాయం అయ్యే ప్రమాదం ఉండేది. పక్కనే ఉన్న వారు కేకలు వేస్తూ అతడిని హెచ్చరిస్తారు. దీంతో తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎట్టకేలకు అతను హెల్మెట్ ఉండడంతో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

Viral Video: పడగ విప్పిన పామును కూడా కూల్ చేసిన గేదె.. చివరికి ఏమైందో చూస్తే..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైకులో వెళ్లే వారంతా హెల్మెట్ ధరించడం సేఫ్’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలను కాపాడిన హెల్మెట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1800కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. చివరకు స్కానింగ్ తీయగా పేగుల్లో షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2024 | 08:43 PM