Viral Video: ఈ వధువేంటీ మరీ విచిత్రంగా ఉందే.. మంటపం కూడా చేరకముందే.. అందరి ముందూ..
ABN , Publish Date - Dec 05 , 2024 | 06:47 PM
వివాహాలు జరుగుతున్న విధానంలో ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి. ఒకప్పుడు పెళ్లిని పెళ్లిలా జరిపితే.. ఇప్పుడు మాత్రం అందులో సినిమా తరహా ట్విస్ట్‌లను జోడించి మరీ అంతా ఆశ్చర్యపోయేలా నిర్వహిస్తున్నారు. చివరకు వధువులు కూడా తగ్గేదే లేదంటూ వరుడితో పడడం చూస్తున్నాం. కొందరు ..
వివాహాలు జరుగుతున్న విధానంలో ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి. ఒకప్పుడు పెళ్లిని పెళ్లిలా జరిపితే.. ఇప్పుడు మాత్రం అందులో సినిమా తరహా ట్విస్ట్‌లను జోడించి మరీ అంతా ఆశ్చర్యపోయేలా నిర్వహిస్తున్నారు. చివరకు వధువులు కూడా తగ్గేదే లేదంటూ వరుడితో పడడం చూస్తున్నాం. కొందరు వధువులు వేదికపై ఎలాంటి సిగ్గు, బిడియం లేకుండా డాన్సులు చేయడం కూడా చూస్తున్నాం. తద్వారా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లి మంటపానికి ఓ వధువు.. మధ్యలో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యేలా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ వధువేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధువు (bride) చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కలిసి వధువును పెళ్లి మంటపానికి తీసుకొస్తున్నారు. కొందరు వధువుకు చుట్టూ నిలబడి దుప్పటిని గొడుగులా పట్టుకుని వెళ్తున్నారు. ఇంకో ఇద్దరు యువుతుల వధువుకు రెండు వైపులా నిలబడి, పూలమాలలతో కూడిన ప్లేట్లను పట్టుకుని ఉంటారు.
Viral Video: ఈ తాత మరీ అమాయకత్వంగా ఉన్నాడే.. ఫోన్‌ను ఎలా శుభ్రం చేస్తున్నాడో చూస్తే అవాక్కవుతారు..
ఇలా అంతా నడుస్తూ వెళ్తుండగా.. వధువు ఉన్నట్టుండి తన టాలెంట్‌ను బయటపెట్టింది. అంతా చూస్తుండగా (bride danced in front of her relatives) సడన్‌గా డాన్స్ స్టార్ట్ చేసింది. అందమైన స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా ఆమె చాలా సేపు డాన్స్ చేస్తూ అందరినీ అలరించింది. చుట్టూ ఉన్న వారు వధువు డాన్స్ చూసి చప్పట్లతో అభినందించారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ వధువేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వధువు డాన్స్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 20 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..