Share News

Viral Video: వధువు ఎదుటే యువతితో సెల్ఫీ దిగాడు.. చివరకు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - May 23 , 2024 | 08:07 PM

వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక విచిత్ర ఘటన జరగడం సర్వసాధారణంగా మారింది. కొందరైతే తమ పెళ్లిళ్లలో ఖచ్చితంగా ఏదో ఒక వినూత్న కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు కావాలనే ఏవేవో ప్రాంక్‪‌లు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: వధువు ఎదుటే యువతితో సెల్ఫీ దిగాడు.. చివరకు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..

వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక విచిత్ర ఘటన జరగడం సర్వసాధారణంగా మారింది. కొందరైతే తమ పెళ్లిళ్లలో ఖచ్చితంగా ఏదో ఒక వినూత్న కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు కావాలనే ఏవేవో ప్రాంక్‪‌లు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధువు పక్కనే ఉండగా వరుడు మరో యువతితో సెల్ఫీ దిగాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దండలు మార్చుకున్న వధూవరులు (bride and groom) .. అతిథులతో ఫొటోలు దిగుతుంటారు. అయితే ఈ క్రమంలో ఓ యువతి వధూవరుల పక్కన కూర్చుని ఫొటో సెల్ఫీ తీయబోతుంది. యువతిని చూసి ఫిదా అయిన వరుడు ఆమెతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపుతాడు. అంతటితో ఆగకుండా ఆమె మొఖంపై మొఖం పెట్టి సెల్ఫీ దిగుతాడు. వరుడి నిర్వాకం చూసి వధువుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘నా ముందరే పిచ్చి వేషాలా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. (bride slapped the groom) అతడి చెంప మీద ఫడేల్‌మని ఒక్కటి ఇస్తుంది. దెబ్బకు వరుడు ఖంగుతింటాడు.

Viral Video: వీళ్లకు ఖచ్చితంగా పిచ్చే అనుకుంటా.. లేకపోతే మిర్చితో ఇలా ఎవరైనా ట్రై చేస్తారా..


వధువు ఒక్కసారిగా ఆగ్రహానికి గురికావడం చూసి అవాక్కవుతాడు. అలాగే పక్కనే ఉన్న యువతి కూడా అలాగే చూస్తుండిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వ్యూస్ కోసం ఇలా ప్లాన్ చేశారు’’.. అంటూ కొందరు, ‘‘వరుడికి చుక్కలు చూపించిన వధువు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. పచ్చి మామిడిని క్షణాల్లో పండుగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 23 , 2024 | 08:07 PM